Telugu News » చిరు “మందాకినీ” సాంగ్ పై ట్రోల్స్…వార్నీ ఈ పాటను అక్కడ కాపీ కొట్టారా..?

చిరు “మందాకినీ” సాంగ్ పై ట్రోల్స్…వార్నీ ఈ పాటను అక్కడ కాపీ కొట్టారా..?

by AJAY MADDIBOINA

హాలీవుడ్, బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన కొన్ని పాటల మ్యూజిక్ ను మన వాళ్ళు కాపీ చేయడం అప్పుడప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఈ మధ్య తెలుగులో వచ్చిన పాటలనే మళ్లీ కొడుతున్నట్టుగా కనిపిస్తోంది.

Ads

mandakini-song-copied-from

ప్రైవేట్ ఆల్బమ్స్, సినిమా పాటలు ఇలా వేటినీ వదలకుండా సంగీతదర్శకులు కాపీ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురం సినిమాలో రాములో రాములో, సామజ వర గమన పాటల మ్యూజిక్ ను మరో రెండు ప్రైవేట్ పాటల మ్యూజిక్ నుండి కాపీ కొట్టారు అంటూ అప్పట్లో ట్రల్స్ వచ్చాయి.

ఇక ఇప్పుడు తాజాగా చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమాలోని ఒక పాట పై కూడా అదేవిధంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఆచార్య సినిమా నుండి చాలా కష్టం మందాకిని అంటూ సాగే ఐటమ్ సాంగ్ ను రీసెంట్ గా విడుదల చేశారు. ఈ పాట శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఈ పాటలో లో హీరోయిన్ రెజీనా మెగా స్టార్ పక్కన స్టెప్పులేసింది. అయితే ఈ పాట అచ్చం సునీల్ హీరోగా నటించిన మిస్టర్ పెళ్ళికొడుకు సినిమాలోని “ఓసినీ నీవోని” అనే పాటను పోలినట్టు ఉంది. అప్పట్లో ఈ పాట సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో ఈ పాటపై తెగ ట్రోల్స్ వస్తున్నాయి. ఇక ఆచార్య సినిమాకు మణిశర్మ స్వరాలు సమకూర్చారు. మిస్టర్ పెళ్ళికొడుకు సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.

Also read : RRR సైడ్ అవ్వడంతో లైన్ లోకి 10 సినిమాలు… సంక్రాంతికి సందడే…!


You may also like