ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి అతి కొద్ది మంది హీరోలు మాత్రమే స్టార్ ల రేంజ్ కు ఎదుగుతారు. అలా స్టార్ హీరో రేంజ్ కు ఎదిగిన హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. అతి తక్కువ సమయంలో విజయ్ దేవరకొండ స్టార్ హీరోల రేంజ్ కు ఎదిగిపోయారు. పెళ్లి చూపులు సినిమాతో విజయ్ ఇండస్ట్రీకి పరిచయం అవ్వగా ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు ఉత్తమ జాతీయ భాషా చిత్రంగా కూడా అవార్డు లభించింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా అర్జున్ రెడ్డి సినిమా రాగా ఈ సినిమా తో విజయ్ దేవరకొండ ఓవర్నైట్ స్టార్ గా మారిపోయారు.
Advertisement
Ad
అందరి దృష్టిని ఆకర్షించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన గీతగోవిందం సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ను సైతం విజయ్ దేవరకొండ తనవైపు తిప్పుకున్నారు. అయితే ఈ సినిమా తర్వాత మాత్రం విజయ్ దేవరకొండ కు అనుకున్నమేర హిట్ లేదనే చెప్పాలి. కానీ స్టార్ దర్శకులు సైతం విజయ్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ లైగర్ అనే చిత్రాన్ని పూర్తి చేశారు.
Advertisement
ఈ సినిమాతో పాన్ ఇండియాకు పరిచయం అవుతున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తదుపరి సినిమాను కూడా విజయ్ దేవరకొండతో ప్రకటించారు. మరోవైపు క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కూడా విజయ్ దేవరకొండతో ఓ సినిమా అనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే స్టార్ హీరో గా ఎదిగిన విజయ్ దేవరకొండ స్టైల్ ను మొదట్లో చాలా మంది ఇష్టపడ్డారు. అయితే లైగర్ మొదలైన సమయం నుండి విజయ్ దేవరకొండ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కోసారి విజయ్ దేవరకొండ ఒక్కో డిఫరెంట్ లుక్ లో కనిపించి ఆశ్యర్యపరుస్తున్నారు. ఇక కొన్నిసార్లు విజయ్ దేవరకొండ వేసుకునే బట్టలు ట్రోల్స్ కు దారితీస్తున్నాయి.
అప్పట్లో పింక్ సూట్ లో విజయ్ దేవరకొండ ఒక ఫోటో షూట్ చేశారు. ఆ ఫోటో షూట్ పై దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. అంతేకాకుండా విజయ్ దేవరకొండ టైగర్ సినిమా కోసం గడ్డం తో జుట్టు పెంచుకుని ఒక లుక్ లో కనిపించారు. ఇక పోకిరి సినిమాలో విలన్ లుక్ లా కనిపించడంతో ఫోటోపై ట్రోల్స్ వచ్చాయి. ఇక రీసెంట్ గా విజయ్ దేవరకొండ పొట్టిగా లూస్ గా ఉన్న ప్యాంట్ పొడుగుగా లూస్ గా ఉన్న షర్ట్ వేసుకుని డిఫరెంట్ లుక్ లో కనిపించారు. ఈ ఫోటోపై కూడా నెట్టింట ట్రోల్స్ వస్తున్నాయి. ఇక బాలీవుడ్ హీరో రన్వీర్ సింగ్ బట్టలు కూడా ఇదేవిధంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. దాంతో రౌడీ హీరో రన్వీర్ సింగ్ ను ఫాలో అవుతున్నాడా అనే అనుమానాలు కూడా నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.