సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇవ్వాలంటే అంత ఈజీ కాదు. అవకాశాల కోసం చెప్పులు అరిగిపోయేలా ఆఫీసుల చుట్టూ తిరగాలి. అలా ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడా అందం…. టాలెంట్ లేనిదే అవకాశాలు రావడం అంత సులువు కాదు. అదృష్టముంటే కెరీర్ ప్రారంభంలో చిన్నచిన్న పాత్రల్లో నటించే ఛాన్స్ దక్కుతుంది. ఆ తర్వాత టాలెంట్ నిరూపించుకుంటే చిన్న సినిమాల్లో హీరో అయిపోవచ్చు.
Advertisement
అయితే ఇండస్ట్రీలో హీరోగా పరిచయం అవ్వాలంటే ఇది ఒక దారి…. హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు మరో దారి కూడా ఉంది. అదే వందల కోట్లు ఖర్చు పెట్టుకుని సినిమా తీసి థియేటర్లలో వదలడం. రీసెంట్ గా ది లెజెండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అరుల్ శరవణన్ కూడా అదే పని చేశాడు. తమిళనాడుకు చెందిన శరవనణ్ బడా వ్యాపారవేత్త…. వందల కోట్ల ఆస్తులకు అధిపతి. వ్యాపారంలో ఎంతో సక్సెస్ అయిన శరవనన్ కు మోడలింగ్ అంటే పిచ్చి.
Advertisement
తన బట్టల బిజినెస్ కోసం హీరోయిన్లతో నటిస్తూ యాడ్స్ ఇప్పిస్తుంటాడు. ఇక ఆ యాడ్స్ లో మోడల్ గా అతడే కనిపించడం విశేషం. తన బట్టల షాపుల కోసం చాలా యాడ్ లలో శరవణన్ కనిపించాడు. ఇక ఇప్పుడు ఏకంగా ది లెజెండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కోసం 100 కోట్ల వరకు ఖర్చుపెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. సినిమాలో హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ భామ ఊర్వశి రౌటెల కోసమే 20 కోట్ల రెమినరేషన్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
ఇక ఈ సినిమాలో శరవనన్ భార్య చనిపోతే అతడు ఏడ్చే సీన్ కు థియేటర్ లలో నవ్వులకు పూస్తున్నాయి. అలాంటి ఎమోషనల్ సీన్ లో శరవనన్ నటన చూసి ప్రేక్షకులు ఎమోషనల్ గా ఫీల్ అవ్వకుండా ఏకంగా పగలబడి నవ్వుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే 100 కోట్లు పెట్టి తీసిన ఈ సినిమాకు భారీగా నష్టాలు వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు శరవనన్ సినిమా పేరుతో పాపులారిటీ సంపాదించుకుని బిజినెస్ ను పెంచుకున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది.