Home » లాల్ చద్దా లోని ఈ సీన్ కి నెటిజెన్ ఇచ్చిన క్యాప్షన్ చూస్తే నవ్వు ఆపుకోలేరు !

లాల్ చద్దా లోని ఈ సీన్ కి నెటిజెన్ ఇచ్చిన క్యాప్షన్ చూస్తే నవ్వు ఆపుకోలేరు !

by AJAY
Ad

బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో అమీర్ ఖాన్. తన సినిమాల కోసం అమీర్ ఖాన్ ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఒక్కో సినిమాలో తనను తాను పూర్తిగా మార్చుకుంటారు. అంతే కాకుండా నటన లోనూ అమీర్ ఖాన్ మిగతా హీరోల కంటే ప్రేక్షకుల నుండి ఎక్కువ మార్కులే కొట్టేస్తారు. దేశంలోనే అత్యధిక కలెక్షన్ లు వసూలు చేసిన టాప్ 5 సినిమాల్లో రెండు సినిమాలు అమీర్ ఖాన్ వే కావడం చెప్పుకోదగ్గ విషయం.

Advertisement

అమీర్ ఖాన్ హీరోగా నటించిన పీకే సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా అత్యధిక కలెక్షన్లు తెచ్చుకుని టాప్ 5 లో నిలిచింది. అంతే కాకుండా దంగల్ సినిమాకు కూడా అదే రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి. ఈ రెండు సినిమాలు బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా తెలుగు తో పాటు ఇతర భాషల ప్రేక్షకులను సైతం మెప్పించాయి. ఈ సినిమాల తో పాటు అమీర్ ఖాన్ హీరోగా నటించిన తారే జమీన్ పర్, త్రీ ఇడియట్స్ సినిమాలకు కూడా దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

Advertisement

ఇక ప్రస్తుతం అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో నాగ చైతన్య కూడా కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉండగా ట్రైలర్ లో అమీర్ ఖాన్ ఎక్స్ప్రెషన్ చూసిన నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

అమీర్ ఖాన్ హీరోగా నటించిన తారే జమీన్ పర్, త్రీ ఇడియట్స్, పీకే, దూమ్ 3 సినిమాలలో ఓకే రకమైన ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చాడని ఇప్పుడు లాల్ సింగ్ చద్దా లో కూడా అలాంటి ఎక్స్ ప్రెషన్సే కనిపిస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే ఏకంగా ఇది పీకే 2 నా లేక తారే జమీన్ పర్ రిటర్న్స్ ఆ అంటూ లాల్ సింగ్ చద్దా సినిమా పోస్టర్ కు క్యాప్షన్ ఇచ్చాడు.

Also read :

“అర్జున్ రెడ్డి” సినిమాను రిజెక్ట్ చేసి బాధపడుతున్న హీరో, హీరోయిన్ ఎవరో తెలుసా…!

Visitors Are Also Reading