ఐపీఎల్ లో అద్భుతంగా ఆడే సంజు శాంసన్ మీద ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. టీమిండియాలో ఛాన్సులు ఇస్తే ఖచ్చితంగా కీలక ప్లేయర్ గా మారుతాడని అందరూ భావించారు. గతంలో కొన్ని సిరీస్ లకు అతన్ని సెలెక్ట్ చేయకపోవడం, ఒకవేళ సెలెక్ట్ చేసిన తుది జట్టులో ప్లేస్ ఇవ్వకపోవడం జరిగింది. దాంతో సంజు ఫ్యాన్స్ మాజీ కెప్టెన్ల మీద, సెలెక్టర్ ల మీద విమర్శలు చేశారు. దాంతో బీసీసీఐ సంజును వెస్టిండీస్ పర్యటనలో ఛాన్స్ ఇచ్చింది.
Advertisement
వన్డే, టీ 20ల సిరీస్ లలో సెలెక్ట్ చేసింది. ఈ రెండు సిరీస్ లలో ఆడిన అన్ని మ్యాచ్లలో సంజు శాంసన్ కు తుది జట్టులో స్థానం లభించింది. కానీ అవకాశాన్ని సంజు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మూడు వన్డేల సిరీస్ లో మొదటి రెండు వన్డేలలో విఫలమైన సంజు మూడో వన్డేలో మాత్రం దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ చేశాడు. దాంతో అతను ఫామ్ లో ఉన్నాడని అందరూ భావించారు. కానీ ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కు మాత్రం సంజు పూర్తిగా నిరాశపరిచాడు. 12, 7, 13 ఇలా ఐదు మ్యాచ్ల సిరీస్ లో బ్యాటింగ్ కు దిగిన మూడు మ్యాచ్లలో సంజు చేసిన పరుగులు. దాంతో ఫ్యాన్స్ సంజు ట్రోల్ చేస్తున్నారు.
Advertisement
ఛాన్స్ ఇవ్వకపోతే ఇవ్వలేదని గోల చేస్తారు. ఇస్తే ఇలాగేనా ఆడేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే టీమిండియాలోకి మళ్ళీ రావడం సంజుకు కష్టమే అంటున్నారు. టీమిండియాలో యువ ప్లేయర్లు చోటు కోసం గట్టి పోటీ ఉంది. ఐపీఎల్ ద్వారా ఎంతోమంది ఆటగాళ్లు టీమ్ ఇండియాలో ప్లేస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో వచ్చిన ఛాన్స్ లో అద్భుత ప్రదర్శన చేస్తే జట్టులో చోటు పదిలమయ్యేది కానీ సంజు మాత్రం జాతీయ జట్టులో రాణించలేకపోయాడు. రెండు సిరీస్ లలో విఫలమైన సంజుకు వచ్చే సిరీస్ లో చోటు ఉంటుందా? లేదా? అన్నది అనుమానమే.
ఇవి కూడా చదవండి :
Virat Kohli: విరాట్ కోహ్లీ కొత్త ఇల్లు.. ఏకంగా 8 ఎకరాల్లో
హీరోయిన్ శోభన పెళ్లికి దూరమవ్వడానికి ఆ స్టార్ హీరోనే కారణమయా…!
హీరోలను మించి అనిరుధ్ రెమ్యూనరేషన్… ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు…?