మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టార్ కమెడియన్ సునీల్ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి ఇండస్ట్రీ మొత్తానికీ తెలుసు. వీరిద్దరూ దాదాపు ఒకేసారి ఇండస్ట్రీ లోకి వచ్చారు. ఒకేసారి పాపులర్ అయ్యారు. సునీల్ మొదటిసారిగా అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి సినిమాలో నటించారు. అయితే.. సునీల్ కు పాపులారిటీ తెచ్చిన సినిమా మాత్రం చిరునవ్వుతో, నువ్వే కావాలి.
ఈ రెండు సినిమాలకు రైటర్ త్రివిక్రమ్. ఈ రెండు సినిమాలతో వీరిద్దరూ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఆ తరువాత త్రివిక్రమ్ రాసిన చాలా సినిమాల్లో సునీల్ కూడా నటిస్తూ వచ్చారు. అయితే.. సినిమాల్లోకి రాకముందు వీరిద్దరూ చాలా ఇబ్బందులని ఎదుర్కొన్నారు. ఒకే రూమ్ లో రెంట్ కి ఉంటూ.. అవకాశాల కోసం కాళ్ళు అరిగేలా తిరిగేవారు. ఓ సారి రెంట్ కట్టడానికి కూడా వారి దగ్గర డబ్బుల్లేవు. రెంట్ కట్టకపోతే ఇల్లు ఖాళీ చేయాలని అప్పటికే ఓనర్ వార్నింగ్ ఇచ్చారట. కేవలం 28 రూపాయలు మాత్రమే త్రివిక్రమ్ వద్ద మిగిలాయి.
Advertisement
Advertisement
వాటితో ఈరోజు ఎలా గడపాలి? రేపటికి ఎలా వెతకాలి అని సునీల్ ఆలోచిస్తూ ఉన్నారట. ఈలోపు త్రివిక్రమ్ షాప్ కి వెళ్లి ఆ డబ్బులతో రెండు కూల్ డ్రింక్స్ తీసుకుని వచ్చారట. దీనితో సునీల్ కోపం తెచ్చుకుని ఈ డబ్బులు కూడా ఇలా ఎలా ఖర్చుపెట్టావ్ అంటూ త్రివిక్రమ్ పై అరిచేశారట. దానికి త్రివిక్రమ్ చాలా కూల్ గా రేపటి కోసం కాదు.. ఈ నిమిషం అవసరం తీరడం కోసం ఆలోచిద్దాం. కష్టతరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆలోచనలో పడడం కరెక్ట్ కానీ, భయపడకూడదు అని, పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొందాం అని త్రివిక్రమ్ హితబోధ చేశారట. త్రివిక్రమ్ మాటలకు సునీల్ సైతం అవాక్కయ్యారట. అయితే ప్రాక్టికల్ గా ఇలాంటి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటు వీరిద్దరూ సినిమా ఇండస్ట్రీ లో నిలదొక్కుకున్నారు.
మరిన్ని ముఖ్య వార్తలు:
నెలకు రూ.700 జీతం కోసం సూర్య అలాంటి పనులు చేసేవాడా..? సినిమాల్లోకి ఎలా వచ్చాడంటే…?
ఆ హీరోయిన్లకు భర్తగా నటించిన హీరోలే అన్నగా నటించిన సినిమాలు ఇవే..!
తమిళ స్టార్ హీరోలకు షాక్.. రెడ్ కార్డు ఇచ్చేందుకు నిర్మాతల మండలి సిద్ధం..!