మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యేక చెప్పాల్సిన అవసరమే లేదు. రైటర్ గా దర్శకుడిగా, చాలా సినిమాల్లో చేశారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆల్ రౌండర్ అయిపోయారు. ఇప్పుడు కేవలం సినిమాలకు దర్శకుడు మాత్రమే కాకుండా.. పవన్ కళ్యాణ్ సినిమాలకు స్క్రీన్ ప్లే, కథ , మాటలు రాసే కొత్త డ్యూటీలో పడ్డాడు. త్రివిక్రమ్ కేవలం స్క్రీన్ ప్లే , మాటలు ఇచ్చినందుకే దాదాపుగా రూ.10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. అదేవిధంగా హారిక బ్యానర్ పై నడిపించేది చిన్నబాబు అయినా వెన్నెముక మాత్రం త్రివిక్రమ్ కావడం విశేషం.
Advertisement
అదేవిధంగా సితార బ్యానర్ కూడా త్రివిక్రమ్ మాటతోనే నడుస్తోంది. ఇలా త్రివిక్రమ్ దర్శకుడిగా మాత్రమే కాకుండా రెండు బ్యానర్లకు స్క్రీన్ ప్లే, మాటలను అందిస్తూ పవన్ కళ్యాణ్ సినిమాలను సెట్ చేస్తూ పలు విధాలుగా డబ్బు బాగానే సంపాదిస్తున్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్ భార్య కూడా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆమె తెరమీద కనిపించదు. కానీ తెర వెనక ఉంటుందని అయితే చెప్పవచ్చు. అయితే కరోనా సమయంలో మల్లువుడ్ లో కప్పల అనే సినిమా హిట్ అయింది. ఇక ఆ సినిమాను రీమేక్ గా తీస్తూ బుట్ట బొమ్మ అనే టైటిల్ తో తెలుగులో తీస్తున్నారు. ఈ సినిమాకు సితార నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.
Advertisement
Also Read : కృష్ణంరాజు మరణం తర్వాత ప్రభాస్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న శ్యామలాదేవి..!
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు. అందులో అమాయక పల్లెటూరు అమ్మాయి పట్నం అబ్బాయి లవ్ లో పడితే ఎలా ఉంటుందో అనే కథతో ఈ సినిమాా తెరకెక్కినట్టు కనిపిస్తోంది. ఈ సినిమాలో సితార నాగవంశీ తో పాటు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య కూడా భాగస్వామి అవుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు త్రివిక్రమ్ దర్శకుడిగా నిర్మాతగా, రైటర్ గా ఇండస్ట్రీని ఏలుతూ వస్తున్నారు. ఇప్పుడు తన భార్యను కూడా నిర్మాతగా రంగంలో దింపనున్నాడు త్రివిక్రమ్. తన భార్య సాయి సౌజన్య ఇండస్ట్రీలో ఎలా సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.
Also Read : అచ్యుత్ సినీ ఇండస్ట్రీలోకి రావడానికి అసలు కారణం ఎవరో తెలుసా ?