Home » త్రివిక్రమ్ ఒక్క రోజు పనికి అన్ని లక్షల రెమ్యునరేషనా..?

త్రివిక్రమ్ ఒక్క రోజు పనికి అన్ని లక్షల రెమ్యునరేషనా..?

by Azhar
Ad
మన తెలుగులో దర్శకుడు త్రివిక్రమ్ కు మంచి గుర్తింపు ఉంది. అలాగే ఈయన సినిమాల్లో రాసె డైలాగ్స్ వల్ల ఈయనను చాలా మంది మాటల మాంత్రికుడు అని కూడా పిలుస్తుంటారు. అయితే ప్రస్తుతం పెద్ద హీరోలతో బిజీగా సినిమాలు చేస్తున్న త్రివిక్రమ్… తాజాగా ఒక్క రోజు పనికి తాను తీసుకున్న రెమ్యునరేషన్ అనేది షాక్ ఇస్తుంది. అయితే మామూలుగానే మన హీరోలు సినిమాలతో పాటుగా సమయం దొరికిన ప్రతిసారి కమర్షియల్ యాడ్స్ అనేవి చేస్తుంటారు అనే విషయం తెలిసిందే. ఇలా పెద్ద హీరోలు చేసే యాడ్స్ కు దర్శకత్వం కూడా పెద్ద డైరెక్టర్లే వహిస్తారు.
అయితే అలా డైరెక్షన్ చేసినందుకు వారికీ పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ సినిమాల విషయంలో కష్టపడినట్లు మన డైరెక్టర్లు అసలు ఏం కష్టపడకుండానే లక్షల్లో సంపాదిస్తున్నారు. మాములుగా ఏ కంపెనీ అయిన స్టార్ హీరోతో యాడ్ తీయాలి అనుకుంటే.. వారే కాన్సెప్ట్ మొత్తం రెడీ చేసుకుంటారు. ఆ తర్వాత తమ దర్శకునితో హీరో స్థానంలో ఓ డూప్ ను పెట్టి ఆ యాడ్ ను షూట్ చేస్తారు. ఆ షూటింగ్ అయిన తర్వాత దానిని తీసుకెళ్లి ఆ హీరోకు చూపిస్తారు. అయితే ఆ యాడ్ అనేది నచ్చితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే హీరో.. దీనికి ఎవరు డైరెక్షన్ చేయాలి అనేది తానే డిసైడ్ చేసుకుంటాడు.
ఇలాంటి సమయంలోనే తనకు బాగా కావాల్సిన దర్శకుడిని హీరో ఎంపిక చేస్తారు. ఆ తర్వాత ఇదే డమ్మీ యాడ్ ను ఆయా డైరెక్టర్ కు చూపిస్తే.. హీరోను పెట్టి.. దానిని అందులో ఉన్న విధంగానే కాపీ చేసి ఇవ్వాలి. తాజాగా ఇలాంటి యాడ్ అల్లు అర్జున్ వల్ల త్రివిక్రమ్ కు వచ్చింది. మాములుగా ఇలాంటి యాడ్స్ ను ఒక్క రోజులో తీసేస్తారు. అయితే ఈ ఒక్క రోజు తీసిన యాడ్ కోసం త్రివిక్రమ్ కు రెమ్యునరేషన్ రూపంలో 40 లక్షలు వచ్చినట్లు తెలుస్తుంది. గతంలో ఇదే అల్లు అర్జున్ వల్ల ఇలాంటి యాడ్ ఒక్కటి హరీష్ శంకర్ కు కూడా దక్కింది.

Advertisement

Visitors Are Also Reading