Home » మహేష్ కు భారీ గ్యాప్ ఇవ్వనున్న త్రివిక్రమ్..!

మహేష్ కు భారీ గ్యాప్ ఇవ్వనున్న త్రివిక్రమ్..!

by Azhar
Ad
సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి రెండున్నరేళ్ల తర్వాత సర్కారు వారి పాట అనే సినిమా వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబీ త్రివిక్రమ్ తో సినిమా అనేది చేస్తున్నట్లు ప్రకటించాడు. కానీ అలా ప్రకటించిన తర్వాత చాలా రోజుల వరకు మహేష్ కొత్త సినిమా అనేది ప్రారంభం కాలేదు. కానీ తాజాగా ఈ మధ్యే ఈ సినిమా యొక్క షూటింగ్ అనేది ప్రారంభించాడు మహేష్.
అయితే ఈ సినిమా ప్రారంభం అయ్యి నెల రోజులు కూడా కాకముందే రెండు రోజుల క్రితం మహేష్ బాబు తల్లిగారు మరణించారు. అయితే మహేష్ కు అమ్మ అంటే ఎంత ఇష్టం అనేది ఆయన ఇప్పటివరకు ఇచ్చిన ప్రతి ఇంటర్వ్యూలో కూడా ప్రకటించారు. అయితే ఇప్పడూ ఇలా అమ్మ తన నుండి దూరం కావడంతో మహేష్ కొత్త డిప్రెషన్ లోకి వెళ్లారు. దానితో మహేష్ కు భారీ గ్యాప్ ఇవ్వాలని త్రివిక్రమ్ అనుకున్నట్లు తెలుస్తుంది.
మహేష్ బాబుతో యాక్షన్ సీక్వెన్స్ అనేది ప్రారంభించిన త్రివిక్రమ్ ఇప్పుడు దానిని ఆపేయాలని అనుకుంటున్నారట. ఇప్పుడు మహేష్ తో షూటింగ్ అనేది చేయకుండా ఎక్కువ రోజులు ఆయనకు విశ్రాంతి అనేది ఇవ్వాలని త్రివిక్రమ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇక అప్పటివరకు మహేష్ లేకుండా సినిమాలో ఎన్ని సీన్స్ ఉన్నాయో అన్ని కూడా పూర్తి చేయాలనీ త్రివిక్రమ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి మళ్ళీ మహేష్ ఎప్పుడు కెమెరా ముందుకు వెళ్తాడు అనేది.

Advertisement

Visitors Are Also Reading