Home » ప్రతి సినిమాలో ఈ ట్రిక్ ఫాలో అవుతున్న “త్రివిక్రమ్”.. ఆ హీరోయిన్ పై కూడా అప్లై చేస్తున్నారా..?

ప్రతి సినిమాలో ఈ ట్రిక్ ఫాలో అవుతున్న “త్రివిక్రమ్”.. ఆ హీరోయిన్ పై కూడా అప్లై చేస్తున్నారా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అంటే తెలుగు ఇండస్ట్రీలో తెలియని వారుండరు. ఆయన ప్రతి సినిమాలో ఏదో ఒక స్పెషల్ తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు తీసి స్టార్ డైరెక్టర్ గా పేరుపొందిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రతి సినిమాలో ఒక ట్రిక్ ఫాలో అవుతూ ఉంటారు..ఆ విషయం మీ అందరికీ తెలిసిందే.. మరి అవేంటో ఒక సారి చూద్దాం..? త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా వచ్చిందంటే అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకుంటారు. ఇప్పటికే ఆయన అనేక సినిమాలు తీశారు.. ఇందులో ప్రతి సినిమాలో హీరోయిన్ లను రిపీట్ చేయడం అలవాటు.. ముందుగా జల్సా, జులాయి మూవీలో హీరోయిన్ గా ఇలియానాను రిపీట్ చేసారు.. దీని తర్వాత హీరోయిన్ సమంతను ఏకంగా 3 మూవీస్ ల్లో రిపీట్ చేసారు త్రివిక్రమ్..

Advertisement

దీని తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, అత్తారింటికిదారేది, ఆహా మూవీస్ లో ఆమెను పెట్టుకున్నారు. ప్రస్తుతము ఈ డైరెక్టర్ పూజా హెగ్డే వంతు వచ్చింది. అల వైకుంఠపురం, అరవింద సమేత, వీర రాఘవ సినిమాల్లో పూజా హెగ్డే హీరోయిన్. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాబోతున్న సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ వస్తుందట. ఈ విధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో హీరోయిన్లను రిపీట్ చేయడం ఆయన స్పెషాలిటీ.. మొన్నటి వరకు సమంతాను తిప్పుకున్న ఆయన ఇప్పుడు పూజా హెగ్డే ను వరుసగా తిప్పుతున్నారు.. ఈ సందర్భంలోనే ఆయన కన్ను మరో హీరోయిన్ పై పడిందని తెలుస్తోంది. ఆమె మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్..

Advertisement

ఈ అమ్మడిపై త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందునుంచే ఓ కన్నేసి ఉంచాడు. ఇందుకే పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ సినిమాలో సంయుక్త మీనన్ ను తీసుకున్నారాయన. తాజాగా పవన్ కళ్యాణ్ మరియు సాయి తేజ్ కాంబినేషన్ లో ఒక కొత్త మూవీ లాంచ్ అయ్యింది.. ఈ మూవీ వెనుక కూడా త్రివిక్రమే అంతా తానే నడిపిస్తున్నారని భీమ్లానాయక్ కు ఏవిధంగా స్క్రీన్ ప్లే మాటలు అందించినట్టుగానే ఈ మూవీ వ్యవహారం అంతా ఆయనపై పెట్టుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో సాయితేజ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా వస్తోందని తెలుస్తోంది. ఈ విధంగా ప్రతి సినిమాలో హీరోయిన్ రిపీటెడ్ గా పెట్టడం ఆయనకున్న స్పెషల్ అని చెప్పవచ్చు.

also read;

సుధీర్ అంటే ఆ యువతికి అంత పిచ్చా.. మరి అక్కడ పచ్చబొట్టు వేయించుకోవడం ఏంటి..?

తన పై సెటైరికల్ గా సినిమా చేసిన పృథ్వీ రాజ్ ఇంటికి వేస్తే ఎన్టీఆర్ ఏం చేశారో తెలుసా…!

Visitors Are Also Reading