Trending Telugu Memes on Varasudu Trailer: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన తాజా చిత్రం వరిసు. ఇది తెలుగులో వారసుడుగా విడుదలవుతోంది. ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకుడు. దిల్ రాజు నిర్మాత. ఈ సినిమా షూటింగ్ ప్రారంభంలో బై లింగ్యువల్ సినిమా అని నిర్మాత దిల్ రాజు తొలుత చెప్పినప్పటికీ ఆ తరువాత ఇది తమిళ సినిమా అని, తెలుగులో డబ్బింగ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. తెలుగులో సంక్రాంతికి బాలయ్య నటించిన వీరసింహారెడ్డి, వారసుడు చిత్రాలు ఒకే రోజు విడుదలవ్వడం విశేషం. మరోవైపు ఆ తరువాత రోజు జనవరి 13న మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా విడుదలవ్వనుంది. అంతకు ముందే అజిత్ హీరోగా నటించిన తెగింపు సినిమా కూడా విడుదలవ్వనుంది.
Advertisement
Trending Telugu Memes on Varasudu Trailer
సంక్రాంతి పం డుగకి విడుదలయ్యే ఈ సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, నందమూరి నటసింహం బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలకు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ థియేటర్లను దక్కకుండా నిర్మాత దిల్ రాజు వారసుడు చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. తమిళనాడులో కూడా అజిత్ తునివు చిత్రానికి పోటీగా భారీగానే విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తికనరబరిచే లోపే ఇంతలోనే ట్రైలర్ విడుదలైంది.
Advertisement
Latest Telugu Trolls Mems on Vijay Varisudu
తాజాగా వారసుడు ట్రైలర్ విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ చిత్రం ట్రైలర్ బాగానే ఉన్నప్పటికీ.. ఇది చూస్తున్న ప్రజలకు చాలా తెలుగు సినిమాలు మైండ్లో స్ట్రైక్ అవ్వడం గమనార్హం. విక్టరీ వెంకటేష్ లక్ష్మీ, మహేష్ బాబు బ్రహ్మోత్సవం, మహర్షి, పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో.., నాని టక్ జగదీష్, నవదీప్ నటించిన గౌతమ్ ఎస్.ఎస్.సి వంటి సినిమాల ఛాయలు కనిపిస్తున్నాయన్నది వాస్తవం. ప్రస్తుతం సోషల్ లో మీమ్స్ వేసి ఈ ట్రైలర్ ని ట్రెండ్ చేస్తున్నారు. వారసుడు ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న మీమ్స్ ని మీరు కూడా చూసేయండి.
Trending Telugu Memes on Varasudu Trailer
ఒక గౌతమ్ SSC ,ఒక మహర్షి
మొత్తంగా చాలా సినిమాలు మిక్సింగ్ చేసి చేసి చూపిస్తున్నారు ,చాలా దారుణం…..Dil raju : అన్నీ సినిమాలు ఒకే సినిమాలో చూస్తున్నాం అనుకోవచ్చు గా…#varisutrailer …#tamilcinema…#Vaarasudu pic.twitter.com/vZZvSxipBh
— Ramu (@Ramu50220164) January 4, 2023
Advertisement