Home » ట్రైన్ టికెట్ బుక్ చేసిన తర్వాత… టికెట్ ను మరో స్టేషన్ కు మార్చుకోవచ్చని మీకు తెలుసా?

ట్రైన్ టికెట్ బుక్ చేసిన తర్వాత… టికెట్ ను మరో స్టేషన్ కు మార్చుకోవచ్చని మీకు తెలుసా?

by Bunty
Ad

సాధారణంగా మనం దూర ప్రయాణాలు చేయాలంటే ముఖ్యంగా ఎంచుకునేది రైలు మాత్రమే. ఎందుకంటే రైలులో రవాణా చార్జెస్ చాలా తక్కువగా ఉంటాయి మరియు కంఫర్ట్ గా ఉంటుంది. కాబట్టి సాధారణ ప్రజల నుంచి ధనవంతులు వరకు ఈ రైల్లోనే ప్రయాణిస్తుంటారు. అలాగే దూర ప్రయాణాలు చేయాలంటే ముందుగా సీట్లను రిజర్వు చేసుకోవాల్సి ఉంటుంది.

అలా రిజర్వ్ చేసుకున్న ప్రయాణికులు తమ రైలు టికెట్లో మార్పులు చేసేందుకు అవకాశం ఇస్తుంది. ఇందుకు తగ్గట్టుగా రైల్వే టికెట్లకు సంబంధించిన నిబంధనలో వెసులుబాటు కల్పిస్తోంది. అందులో భాగంగా రైల్వే మరో వేసులు బాటు కల్పించింది. రైల్వే ప్రయాణికులు తాము బుక్ చేసుకున్న గమ్యస్థానానికి కాకుండా ఇంకా ముందుకు ప్రయాణించాలనుకుంటే రైలు టికెట్లు మార్పులు చేయొచ్చు. టికెట్ ఎక్స్టెండ్ సర్వీస్ పేరుతో కొత్తగా ఈ సేవను అందిస్తోంది. ఇందుకోసం రైల్వే ప్రయాణికులు రైలులో ఉన్న టీటీఈ దగ్గరకు వెళ్లి తమ టికెట్ చూపించాలి. తాము ఇంకా ముందుకు ప్రయాణించాలనుకుంటున్నట్టు చెప్పాలి.

Advertisement

Advertisement

ప్రయాణికులు కోరుకున్నంత దూరం ప్రయాణించడానికి టిటిఈ టికెట్ లో మార్పులు చేస్తారు. ఇందుకోసం ఆధనంగా కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఈ చార్జీ పాయింట్ టు పాయింట్ ప్రతిపాదికన ఉంటుందని గమనించాలి. అంటే మీరు దిగాల్సిన స్టేషన్ నుంచి పొడిగించబడిన స్టేషన్ వరకు టికెట్ ధర ఎంత ఉంటుందో అంతా టిటిఈ ఛార్జ్ చేస్తారు. టికెట్ ఎక్స్టెండ్ సర్వీస్ అండ్ రిజర్వ్ చేయని టికెట్ల కోసం అందుబాటులో ఉంటుంది. మీరు ఎప్పుడైనా సాధారణంగా టికెట్ ను అప్ గ్రేడ్ చేయవచ్చు. కానీ రిజర్వ్ చేసిన టికెట్ల విషయానికొస్తే మీరు కోరుకున్న స్టేషన్ వరకు సీటు అందుబాటులో ఉంటేనే అప్ గ్రేడ్ సాధ్యమవుతుంది.

READ ALSO : అల్లు అరవింద్ కు ఇంకో కొడుకు ఉన్నాడా.. షాకిచ్చిన శిరీష్!

Visitors Are Also Reading