Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » రైలు ప్రయాణంలో మీ రిజర్వుడు సీట్లను వేరొకరు ఆక్రమించారా.. అయితే ఇలా చేస్తే చాలు..!!

రైలు ప్రయాణంలో మీ రిజర్వుడు సీట్లను వేరొకరు ఆక్రమించారా.. అయితే ఇలా చేస్తే చాలు..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

సాధారణంగా మనం దూర ప్రయాణాలు చేయాలంటే ముఖ్యంగా ఎంచుకునేది రైలు మాత్రమే. ఎందుకంటే రైలులో రవాణా చార్జెస్ చాలా తక్కువగా ఉంటాయి మరియు కంఫర్ట్ గా ఉంటుంది. కాబట్టి సాధారణ ప్రజల నుంచి ధనవంతుల వరకు ఈ రైల్లోనే ప్రయాణిస్తుంటారు. అలాగే దూరప్రయాణాలు చేయాలంటే ముందుగా సీట్లను రిజర్వు చేసుకోవాల్సి ఉంటుంది. అలా రిజర్వు చేసుకున్న సీటులోనే మనం కూర్చోవాల్సి వస్తుంది.

Advertisement

Ad

అయితే ఒక్కో సమయంలో మనం రిజర్వు చేసుకున్న సీట్లపై వేరొకరు వచ్చి కూర్చొని మళ్లీ మనకే ఉచిత సలహాలు ఇస్తూ సీట్ షేర్ చేసుకుందాము అంటూ అంటుంటారు. అలాగే ఒక్కొక్క సమయంలో కూడా ఈ విషయంలో అనేక ఘర్షణలు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఘటనలు దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రైలు ప్రయాణికులకు ఎలాంటి ఘర్షణలు జరగకుండా, ఎలాంటి బెదిరింపులకు గురి కాకుండా సరికొత్త ప్లాన్ చేసింది. మరి అవేంటో చూద్దాం..

Advertisement

రైలులో మనం బుక్ చేసుకున్న సీట్లు ఆక్రమించుకొని మన పైకి కొంత మంది ధాబాయిస్తూ ఉంటారు. ఈ సమయంలో టీటీకి వెంటనే కంప్లైంట్ చేయాలి.అలాగే ట్రైన్ లో ఎవరైనా మీకు సీటు విషయంలో ఇబ్బంది కలిగించి నట్లయితే మొదట ఈ విషయాన్ని టీటీఈ కి చెప్పిన తర్వాత వారు అలాగే వేధించినట్లు అయితే , మీరు ఆన్లైన్ ద్వారా కంప్లైంట్ ఇవ్వకపోతే రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ 139 కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని రైల్వే శాఖ పై అధికారులు అంటున్నారు.

ALSO READ:

Visitors Are Also Reading