Home » అల్లు అర్జున్, క‌ల్యాణ్ రామ్ ల‌కు షాకిచ్చిన హైద‌రాబాద్ పోలీసులు..!

అల్లు అర్జున్, క‌ల్యాణ్ రామ్ ల‌కు షాకిచ్చిన హైద‌రాబాద్ పోలీసులు..!

by AJAY
Ad

హైద‌రాబాద్ పోలీసులు ట్రాఫిక్ నిబంధ‌న‌లు పాటించని వారిపై కొర‌డావిసురుతున్నారు. సాధార‌ణ ప్ర‌జ‌లైనా సెల‌బ్రెటీలు అయినా వ‌దిలి పెట్ట‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. రీసెంట్ గా జూనియ‌ర్ ఎన్టీఆర్ కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ ల‌ను పోలీసులు తొల‌గించిన సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా క‌ల్యాణ్ రామ్, అల్లు అర్జున్ ల కార్ల‌కు ఉన్న బ్లాక్ ఫిల్మ్ ల‌ను కూడా జూబ్లిహిల్స్ పోలీసులు తొలగించారు. అంతే కాకుండా రూ.700 చొప్పున వారిద్ద‌రికీ జ‌రిమానాలు విధించారు.

Advertisement

Advertisement

జూబ్లిహిల్స్ రోడ్ నంబ‌ర్ 36 లో పోలీసులు త‌నికీలు నిర్వ‌హించారు. అదే స‌మ‌యంలో క‌ల్యాణ్ రామ్ మ‌రియు అల్లు అర్జున్ ల కార్లు ఆ దారిలో వ‌చ్చాయి. దాంతో కారుకు బ్లాక్ ఫిల్మ్ ల‌ను గుర్తించిన పోలీసులు వాటిని తొల‌గించారు. అంతే కాకుండా ఇద్ద‌రికీ జరిమానాల‌ను విధించారు. ఇక పోలీసుల త‌నీకీల‌లో ట్రాఫిక్ నిబంధ‌న‌లు పాటించ‌కుండా మ‌రో 80 మంది ప‌ట్టుబ‌డ‌గా వారికి కూడా జ‌రిమానాలు విధించారు. ఇదిలా ఉంటే గ‌తంలో క్రైమ్ ను అరికట్టడానికి కార్ల‌కు బ్లాక్ ఫిల్మ్ ల‌ను తొల‌గించాల‌ని నిర్న‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

Visitors Are Also Reading