2019 కరోనా రాక ముందు వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త చిత్రం వచ్చిందంటే సినిమా ఎలా ఉన్నా.. కాసుల వర్షం కురిసేది. ముఖ్యంగా మొదటి రోజు బాలీవుడ్ సినిమాలను కూడా దాటేసే విధంగా కలెక్షన్‌లు వసూలు అయ్యేవి.
Advertisement
బాహుబలి, సైరా నర్సింహారెడ్డి, అజ్ఞాతవాసి వంటి సినిమాలు తొలి రోజే దాదాపు రూ.40కోట్లకు పైగా షేర్ వసూలు చేసాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అదిరిపోయే వసూలు వచ్చేవి.
Advertisement
కానీ కరోనా తరువాత ఆ స్థాయి ప్రభంజనం కనిపించడం లేదు. వకీల్‌సాబ్, అఖండ లాంటి పునర్ వైభవం తీసుకురావడానికి భాగానే కృషి చేసాయి. తాజాగా విడుదలైన పుష్పకూడా అదే బాటలో బాగానే కుమ్మేసింది. కరోనా సెకండ్‌వేవ్ తరువాత దేశంలో అత్యధికంగా వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులు తిరగరాసింది పుష్ప. కాకపోతే తెలుగు రాష్ట్రంలో మాత్రం పుష్ప వెనుకపడ్డాడు. 2021లో వకీల్‌సాబ్ 32 కోట్ల షేర్‌తో మొదటి స్థానంలో ఉండగా.. పుష్ప రెండవ స్థానంతో సరిపెట్టుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు మొదటి రోజు హయ్యస్ట్ వసూలు సాధించిన సినిమాలేంటో ఒక సారి చూద్దాం..
- బాహుబలి రూ.43కోట్లు షేర్ మొదటి స్థానంలో ఉండగా..
- సైరా నరసింహారెడ్డి 38.75 కోట్లు,
- సాహో 36.52 కోట్లు,
- సరిలేరు నీకెవ్వరు 32.77 కోట్లు,
- వకీల్ సాబ్ 32.44 కోట్లు,
- అరవింద సమేత 26.64 కోట్లు,
- అజ్ఞాతవాసి 26.40 కోట్లు,
- వినయ విధేయ రామ రూ.26కోట్లు,
- అలా వైకుంఠపురంలో 25.96 కోట్లు,
- పుష్ప 24.90 కోట్ల షేర్ వసూలు చేశాయి.
Also Read: పుష్పను కేజీఎఫ్ సినిమాతో పోల్చలేం…బుచ్చిబాబుతో మాట్లాడా : సుకుమార్