Home » 2022లో TOP 5లో నిలిచిన భారతీయ సంపన్నులు..ఎవరంటే..?

2022లో TOP 5లో నిలిచిన భారతీయ సంపన్నులు..ఎవరంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. దీంతో చాలా వ్యాపారాలు డల్ అయ్యాయి.. ఇక 2022వ సంవత్సరం కరోనా దూరమై మళ్లీ పాత రోజులు వచ్చాయి. వ్యాపారాలు కూడా పుంజుకున్నాయి.. ఈ ఏడాది చాలామంది వ్యాపారస్తులు లాభాలపరంగా వృద్ధి సాధించారు.

ఇందులో ముఖ్యంగా అదాని,అంబానీ వంటి ప్రముఖులు చాలా ఎదిగిపోయారు.. కాబట్టి 2022వ సంవత్సరంలో భారతదేశంలో అత్యధిక సంపన్నుల జాబితాలో ఎవరు ఎన్నో స్థానంలో ఉన్నారో మనం ఎప్పుడు చూద్దాం.. ఫోర్బ్స్ ఇండియా ప్రకారం 2022లో టాప్ 5 ధనవంతుల జాబితా.. వారి నికర ఆస్తుల విలువ ఇప్పుడు చూద్దాం..
#1. గౌతమ్ అదాని :

Advertisement

అదాని ఇండస్ట్రీ చైర్మన్ గౌతమ్ అదాని ఈ సంవత్సరం అత్యంత సంపన్న భారతీయుల లిస్ట్ లోకి ప్రవేశించాడు. ఈయన ఒకే ఏడాది $ 75.2 బిలియన్ల సంపదతో ఈ ఏడాది ఆయన సంపద మూడు రెట్లు పెరిగింది. భారత సంపూర్ణ జాబితాలో మొదటి స్థానం లోకి వచ్చాడు.

ALSO READ:పెళ్లి పీటలు ఎక్కబోతున్న కేరింత హీరోయిన్…వరుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు ..!

#2. ముఖేష్ అంబానీ :

Advertisement

2021 సంవత్సరంలో అత్యంత సంపన్నుల జాబితాలో భారత దేశంలో మొదటి స్థానంలో ఉన్న అంబానీ ఈ ఏడాది కాస్త తగ్గారు. రూ.710,723.26 నికర విలువ5% నష్టాలతో రెండవ స్థానంలో ఉన్నాడు.
#3. RK దమని :

డి మార్ట్ గ్రూప్స్, రిటైల్ గేమ్ చేంజెస్ హెడ్ రాధాకృష్ణ దమాని రూ.222,908.66 కోట్ల నికర విలువతో మూడవ స్థానంలోకి వచ్చాడు.
#4. సైరస్ పూనా వల్ల :

ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్ పునావల్ల రూ :173,642.62 కోట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు.. 2020 నుంచి 2021 వరకు కరోనా సమయంలో వ్యాక్సిన్ అమ్మకాలు పెరగడంతో ఆయన సంపద కూడా పెరిగిపోయింది.
5. శివ్ నాడార్ :

HCL టెక్ దిగ్గజమైన చైర్మన్ శివ్ నాడార్ రూ.172,834.97 కోట్ల సంపదతో 5వ స్థానంలో నిలిచాడు.. ఇండియాలో ఐటీ పరిశ్రమకు మార్గదర్శకుడైన శివ్ నాడర్ 2021-22 మధ్యకాలంలో సంపద పెరిగింది.

ALSO READ:

Visitors Are Also Reading