Home » IPL 2022 : ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆరంగేట్రం చేసే 10 మంది విదేశీ ఆట‌గాళ్లు వీరే..!

IPL 2022 : ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆరంగేట్రం చేసే 10 మంది విదేశీ ఆట‌గాళ్లు వీరే..!

by Anji
Published: Last Updated on
Ad

ఐపీఎల్ 15వ సీజ‌న్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. ప్ర‌తిసారి మాదిరిగానే ఈ సీజ‌న్‌లో తొలిసారిగా ఐపీఎల్‌లో ప‌లువురు విదేశీ ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేశారు. అయితే కొనుగోలు చేసిన ఆట‌గాళ్లంద‌రికీ ఐపీఎల్‌లో ఆరంగేట్రం చేసే అవ‌కాశం అవ‌స‌రం లేదు. వీరిలో ఎంపిక చేసిన కొంత మంది ఆట‌గాళ్ల‌కు మాత్ర‌మే ఐపీఎల్ ఆరంగేట్రం అవ‌కాశం ల‌భిస్తుంది. ఆట‌గాళ్లు ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఓడిన్ స్మిత్

వెస్టిండిస్ ఆట‌గాడిని పంజాబ్ కింగ్స్ రూ.6కోట్ల‌కు కొనుగోలు చేసింది. బౌలింగ్‌తో పాటు లాంగ్ షాట్లు ఆడ‌డంలో ఈ ఆట‌గాడు నిష్ణాతుడు. స్మిత్ ఫినిషర్ పాత్ర‌ను కూడా బాగా పోషించ‌గ‌ల‌డు. ఐపీఎల్‌లో ఆరంగేట్రం చేసే అవ‌కాశాలు 100 శాతం ఉన్నాయి.

డెవాల్డ్ బ్రెవిస్

ఈ సారి అండ‌ర్ -19 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఈ ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు స‌త్తా చాటాడు. ఈ ఆల్‌రౌండ‌ర్ బ్యాట్‌, బాల్ రెండింటితోనూ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. అత‌డిని ముంబై ఇండియ‌న్స్ రూ.3కోట్ల‌కు కొనుగోలు చేసింది.

రొమారియో షెప‌ర్డ

 

వెవెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ భారీ షాట్ వాడడంలో నేర్పరి. ఒత్తిడి సమయంలో బౌలింగ్ చేసినా.. రెంటిలోనూ మెరుగైన ప్రదర్శన చేయగలరు. వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ 7.75 కోట్లకు కొనుగోలు చేసింది.

డారిల్ మిచెల్

ఈ న్యూజిలాండ్ ఆల్ రౌండర్ టీ 20 ప్రపంచకప్ లో తన జట్టును ఫైనల్ కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ లో లో అతను రాజస్థాన్ రాయల్స్ తరపున అరంగేట్రం చేసే అవకాశం ఉంది. రూ. 75 లక్షలకు రాజస్థాన్ కొనుగోలు చేసింది.

డ్వేన్ ప్రిటోరియస్

Advertisement

దక్షిణాఫ్రికాకు చెందిన ఈ ఆల్ ఆల్ రౌండర్ చెన్నై సూపర్ కింగ్స్ లో భాగం. రూ. 50లక్షలకు సి ఎస్ కే కొనుగోలు చేసింది. చెన్నై దగ్గర అ ఫాస్ట్ బౌలింగ్ కే పరిమితమైన ఆప్షన్లను చూస్తుంటే ఈసారి ఐపీఎల్ అరంగేట్రం చేసే అవకాశం కచ్చితంగా దక్కుతుంది అనిపిస్తోంది.

ఒబెడ్ మెక్ కాయ్

ఈ వెస్టిండీస్ ఫాస్ట్ బౌల‌ర్‌ను రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌మ జ‌ట్టులో చేర్చుకుంది. రూ.75లోల‌కు రాజస్థాన్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. అత‌ను ఈ ఏడాది ఐపీఎల్ ఆరంగేట్రం చేసే అవ‌కాశం ఉంది.

డెవాన్ కాన్వే

ఈ కివీస్ ఆట‌గాడి బ్యాటింగ్ స‌గ‌టు అంత‌ర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్ల‌లో 50 కంటే ఎక్కువ‌గా ఉంది. ఈ ఆట‌గాడిని చెన్నై సూప‌ర్ కింగ్స్ కోటి రూపాయ‌ల‌కు కొనుగోలు చేసింది. అత‌ని ఐపీఎల్ ఆరంగేట్రం ఈసారి ఖాయంగా క‌నిపిస్తోంది.

దుష్మంత చ‌మీర

ఈ శ్రీ‌లంక ఫాస్ట్ బౌల‌ర్‌ను ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ రూ.2కోట్ల‌కు త‌న జ‌ట్టులోకి చేర్చుకుంది. ఈ ఆట‌గాడు అద్భుత‌మైన యార్క‌ర్లు విస‌ర‌డంలో పేరుగాంచాడు.న

రాసీ వాన్ డెర్ డ‌స్సెన్

ఈ ఏడాది ప్రారంభంలో భార‌త్‌తో జ‌రిగి వ‌న్డే సిరీస్‌లో ద‌క్షిణాఫ్రికా బ్యాట్స్‌మెట్ అద్బుతంగా ఆక‌ట్టుకున్నారు. రాజ‌స్తాన్ రూ.కోటికి కొనుగోలు చేసింది. ఈసారి ఐపీఎల్‌లో ఆరంగేట్రం చేసే అవ‌కాశం కూడా దాదాపు ఖాయం అయింది.

బెన్ని హోవెల్

ఈ ఇంగ్లీష్ బౌల‌ర్ త‌న స్లో బాల్‌కు ప్ర‌సిద్ధి చెందాడు. అత‌ను మెరుగైన ఫినిషర్ పాత్ర‌ను కూడా పోషించ‌గ‌ల‌డు. అత‌న్ని పంజాబ్ కింగ్స్ రూ.40ల‌క్షల‌కు కొనుగోలు చేసింది. అత‌ను ఈసారి ఐపీఎల్‌లో ఆరంగేట్రం చేసే అవ‌కాశం కూడా పొంద‌వ‌చ్చు.

Visitors Are Also Reading