ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలకు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. దాంతో హీరోల ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. కేవలం బయట మాత్రమే కాకుండా సోషల్ మీడియాలోనూ మన హీరోలకు మిలియన్స్ కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో వారి వారి ఫాలోవర్స్ సంఖ్య వేరుగా ఉంది. కాగా ట్విట్టర్ లో ఏ హీరోకు ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారో ఇప్పుడు చూద్దాం…
Advertisement
మహేశ్ బాబుకు ట్విట్టర్ లో టాలీవుడ్ లోనే అత్యధికంగా అభిమానులు ఉన్నారు. మహేశ్ బాబు ఇప్పటి వరకూ పాన్ ఇండియా సినిమాలో నటించకపోయినా ఆయన ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య మాత్రం ఓ రేంజ్ లో ఉంది. ప్రిన్స్ ను ఏకంగా 12.8 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. రీసెంట్ గా పుష్ఫతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. స్టైలిష్ స్టార్ కు టాలీవుడ్ తో పాటూ మాలీవుడ్ లోనూ అభిమానులు ఉన్నారు. ఇక బన్నీ ట్విట్టర్ లో 7.1 మిలియన్స్ ఫాలోవర్స్ తో రెండో స్థానంలో ఉన్నాడు.
Advertisement
బాహుబలి సినిమాతో రానా ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. చేసింది నెగిటివ్ రోల్ అయినా కూడా రానా నటనకు ఫిదా అయ్యారు. ఇక రానాకు ట్విట్టర్ లో 6.5 మిలియన్స్ అభిమానులు ఉన్నారు. మన్మథుడు నాగార్జున కుర్రహీరోలతో పోటీ పడుతున్నాడు. ఇక నాగార్జున కు తన కుమారుల కంటే ఎక్కువగా ట్విట్టర్ లో ఫ్యాన్స్ ఉండటం విశేషం. నాగ్ కు ట్విట్టర్ లో 6.3 మిలియన్ల అభిమానులు ఉన్నారు.
Advertisement
జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఎన్టీఆర్ కు కూడా సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. ఎన్టీఆర్ ను ట్విట్టర్ లో 6.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన సోషల్ మీడియాలో సినిమాల కంటే రాజకీయాలకు సంబంధించిన పోస్టులే పెడుతుంటారు. కాగా పవన్ కల్యాణ్ కూడా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. పవన్ ను ట్విట్టర్ లో 5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.