Home » టాలీవుడ్ టాప్ 10 విలన్స్.. వారి రెమ్యునరేషన్.. తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!

టాలీవుడ్ టాప్ 10 విలన్స్.. వారి రెమ్యునరేషన్.. తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఏ సినిమా వచ్చిన హీరో తర్వాత అత్యంత ప్రాముఖ్యత లభించే పాత్ర విలన్. ప్రతినాయకుడి పాత్ర లేకుంటే సినిమా చూడటానికి కూడా బాగుండదని చెప్పవచ్చు. అలా ఇండస్ట్రీలో విలన్లుగా కొనసాగుతూ ఎంతో పేరు తెచ్చుకున్నారు ఈ నటులు. హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వీరి పారితోషకం కూడా తీసుకుంటారట.. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం..

ప్రకాష్ రాజ్:

Advertisement

తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్.. అంతపురం సినిమా ద్వారా ఒక్కసారిగా విలన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి ప్రకాష్ రాజ్ ఏ పాత్రలో అయినా ఒదిగిపోయే టాలెంట్ ఉన్న నటుడు. ఆయన కోటి యాభై లక్షలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటాడట.

సోను సూద్:

భాషతో సంబంధం లేకుండా ఏ ఇండస్ట్రీలో అయినా మెప్పించే ఏకైక విలన్ సోనుసూద్. ఈయన సినిమాలోని విలన్ కానీ బయట చాలా మంచి వ్యక్తి. ఈయన కూడా ఒక సినిమాకు 80 లక్షల నుండి కోటి వరకు తీసుకుంటాడట.

సంపత్ రాజ్:

మిర్చి సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంపత్ రాజ్. ఒక్క చిత్రానికి 60 లక్షల నుండి 70 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడట.

సాయికుమార్ :

ఎవడు చిత్రంలో మొదటిసారి విలన్ పాత్రలో మెరిపించిన సాయికుమార్ ఒక్క సినిమాకు 50 లక్షల వరకు తీసుకుంటారట.

సుదీప్:

Advertisement

స్టార్ హీరోగా కొనసాగుతున్న సుదీప్ ఈగ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈయన మూడు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటాడు.

ఆది పినిశెట్టి :

హీరో ఆది పినిశెట్టి సపోర్టింగ్ పాత్రలో కాకుండా విలన్ గా కూడా మెప్పించాడు. ఈయన కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడట.

also read:తండ్రి వ‌య‌సున్న హీరోల‌కు జోడీగా న‌టించిన 6గురు టాలీవుడ్ హీరోయిన్ లు వీళ్లే..!

జగపతిబాబు :

హీరోగా ఎన్నో సినిమాలు చేసే సక్సెస్ అందుకున్న జగపతిబాబు. విలన్ గా కూడా మెప్పించాడు. ఈయన ఒక్కో సినిమాకు రెండు కోట్లకు పైగానే తీసుకుంటారట.

వివేక్ ఒబెరాయి:

రామ్ చరణ్ మూవీ వినయ విధేయ రామలో విలన్ గా చేసిన వివేక్ మూడు కోట్లు తీసుకుంటారట.

హరీష్ ఉత్తమన్ :

కోలీవుడ్ లో బిజీగా ఉండే స్టార్ నటుడు .. టాలీవుడ్ లో వినయ్ విధేయ రామ, కల్కి వంటి సినిమాల్లో విలన్ గా చేశాడు. 50 లక్షల పారితోషకం తీసుకుంటారట.

రవికిషన్:

రేసుగుర్రం, సైరా వంటి సినిమాల్లో విలన్ గా చేశాడు. ఈయన 40 నుంచి 50 లక్షల పారితోషికం తీసుకుంటారని టాక్..

also read:

 

Visitors Are Also Reading