Tollywood Telugu Female Anchors List, Remuneration Details: ఒకప్పుడు యాంకర్స్ అంటే కేవలం మాటలతోనే అందరినీ ఆకట్టుకునేవారు. కానీ ప్రస్తుతం యాంకర్స్ కూడా హీరోయిన్లకు ధీటుగా సరికొత్తగా ఎట్రాక్ చేస్తున్నారు. సినిమాలకు హీరోలు, హీరోయిన్స్ ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. బుల్లితెర పై యాంకర్లకు కూడా అంతే ప్రాధాన్యత సంతరించుకుంది.
Tollywood Telugu Female Anchors List, Remuneration Details
Advertisement
కొంత మంది ఫీమేల్ యాంకర్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరికొంత మంది అయితే వరుస సినిమాలతో కూడా బిజీగా గడుపుతున్నారు. తెలుగు యాంకర్లు తమ కష్టానికి తగ్గట్టుగా రెమ్యునరేషన్ ఇచ్చి పుచ్చుకుంటున్నారు. ఆడియో ఫంక్షన్లకు, ప్రత్యేక షోలు, ఎపిసోడ్ లకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Tollywood Telugu Female Anchor Suma Kanakala సుమ కనకాల :
సుమ కనకాల తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ యాంకర్ గా కొనసాగుతున్నారు. మలయాళంకు చెందిన సుమ మార్చి 22, 1975లో జన్మించింది. మలయాళంతో పాటు సుమ తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీషు వంటి భాషల్లో మాట్లాడుతుంది. సుమ కనకాల టీవీ ప్రెజెంటర్ గా తన కెరీర్ ని ప్రారంభించింది. యాంకర్ సుమ రాజీవ్ క్రియేషన్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ని కూడా కలిగి ఉంది. తెలుగులో టాప్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ కనకాల 2.5లక్షలకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటోంది.
Tollywood Telugu Female Anchor Anasuya Bharadwaj అనసూయ భరద్వాజ్
ప్రస్తుతం అనసూయ తెలుగు సినీ పరిశ్రమలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆమె మే 15, 1985న జన్మించింది. తొలుత సాక్షి టీవీలో న్యూస్ ప్రెజెంటర్ గా తన కెరీర్ ని ప్రారంభించింది అనసూయ. ఆ తరువాత వేదం, పైసా వంటి సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారింది. జబర్దస్త్ కామెడీ షోకి యాంకర్ గా పాపులారిటీని సంపాదించుకుంది. యాంకర్ గా అనసూయ దాదాపు రూ.2లక్షలకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. రంగస్థలం, పుష్ప వంటి సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Advertisement
Tollywood Telugu Female Anchor Rashmi Gautam రష్మీగౌతమ్
రష్మీ గౌతమ్ ఏప్రిల్ 07, 1988న విశాఖపట్టణంలో జన్మించారు. ఆమె మాతృ భాష ఒడియా. ఆమె తండ్రి ఉత్తరప్రదేశ్ కి చెందిన వారు. దాదాపు 10-12 సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగుతుంది. జబర్దస్త్ ద్వారా మంచి పాపులారీటీని సంపాదించుకుంది రష్మి. రూ.1లక్ష 50వేల నుంచి లక్ష 75వేల వరకు రెమ్యునరేషన్ పుచ్చుకుంటోంది రష్మి గౌతమ్.
Tollywood Telugu Female Anchor Sreemukhi శ్రీముఖి
శ్రీముఖి మే 10, 1993న జన్మించింది. బిగ్ బాస్ లోకి ప్రవేశించే ముందు ఆమె టీవీ వ్యాఖ్యాతగా కొనసాగారు. ప్రధానంగా స్టార్ MAA లో ప్రసారమయ్యే బిగ్ బాస్ షోతో ఆమె పాపులర్ అయింది. శ్రీముఖిపై ప్రజలకు సానుకూల ప్రభావాన్ని బిగ్ బాస్ సృష్టించిందనే చెప్పవచ్చు. శ్రీముఖి యాంకర్ ప్రస్తుతం దూసుకెళ్తున్నారు. శ్రీముఖి ప్రస్తుతం ఈటీవీ, ఈటీవీ ప్లస్, స్టార్ మా, జీ తెలుగు వంటి పలు ఛానల్స్ ని కవర్ చేస్తుంది.
Tollywood Telugu Female Anchor Ariyana Glory అరియానా గ్లోరీ
అరియానా జనవరి 23, 1993న జన్మించింది. ఆమె టెలివిజన్ వ్యాఖ్యాత. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఆమె విపరీతమైన అభిమానులను సంపాదించుకుంది. 2015లో ఆమె యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తరువాత పలు టీవీ ఛానళ్లలోనూ ఎన్నో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. జెమిని కెవ్వు కామెడీ యాంకర్ గా అరియానా ఫేమస్ అయ్యారు. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4లో పదో కంటెస్టెంట్ గా యాంకర్ అరియానా గ్లోరి వచ్చింది. దాదాపు రూ.లక్ష వరకు పైగా అరియానా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.
Telugu Anchor Varshini వర్షిని
వర్షిని ఏప్రిల్ 06, 1988లో జన్మించింది. ఈమె ఢీ డ్యాన్స్ షో ద్వారా ఫేమస్ అయింది. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపునే సంపాదించుకుంది. ప్రస్తుతం యాంకర్ గా వర్షిని రూ.30వేల నుంచి రూ.50వేల వరకు అందుకున్నట్టు సమాచారం.
Telugu Anchor Manjusha యాంకర్ మంజూష
యాంకర్ మంజూష 1990లో పుట్టింది. ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమాలో సిస్టర్ పాత్రలో చాలా సింపుల్ కనిపించింది. ఆ తరువాత యాంకర్ గా కొత్త కెరీర్ ని ప్రారంభించింది. మంజూష ఈవెంట్స్ కి రూ.50వేల నుంచి 1లక్ష వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం.