Home » కుటుంబం కోసం పెళ్లి కూడా త్యాగం చేసి.. దీనస్థితిలో ఉన్న లేడీ కమెడియన్స్.. ఎవరంటే..?

కుటుంబం కోసం పెళ్లి కూడా త్యాగం చేసి.. దీనస్థితిలో ఉన్న లేడీ కమెడియన్స్.. ఎవరంటే..?

by Sravanthi
Ad

లేడీ కమెడియన్స్ అనగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది కోవై సరళ, గీతా సింగ్, శ్రీలక్ష్మి, ఝాన్సీ ఇలా అనేకమంది లేడీ కమెడియన్స్ మనందరినీ కడుపుబ్బ నవ్విస్తూనే ఉంటారు. అలాంటి టాలీవుడ్ లేడీ కమెడియన్స్ జీవితంలో అనేక విషాదాలు ఉన్నాయి. ఈ కమెడియన్స్ లో చాలామంది పెళ్లి కూడా చేసుకోకుండా ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు .. మరి అలాంటి లేడీ కమెడియన్స్, వారి జీవితంలో పెళ్లిళ్లు ఎందుకు చేసుకోలేదో తెలుసుకుందాం..
#1. కోవై సరళ :

also read;Big boss6 telugu shrihan: శ్రీహాన్ ముస్లిం అని తెలుసా.. కానీ హిందూ పేరు పెట్టుకోవడం వెనుక షాకింగ్ నిజాలు..?

Advertisement

తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేడీ కమెడియన్ గా టాప్ లిస్టులో ఉంటుంది. బ్రహ్మానందం కోవై సరళ కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ హిట్. 1990 వ సంవత్సరం నుంచి బాగా పాపులర్ అయిన కోవై సరళ, తన కుటుంబాన్ని పోషించడం కోసం వివాహం చేసుకోలేదు. తన తోడబుట్టిన వాళ్ళందరినీ లైఫ్ లో సెటిల్ చేయడం కోసం తాను ఎంతో కష్టపడుతూ వచ్చింది. అలాంటి కోవై సరళలకు ప్రస్తుతం ఏదైనా ఆసుపత్రి ప్రాబ్లం వస్తే చూసుకునేవారు లేకపోవడం దారుణం.
#2. శ్రీలక్ష్మి:

Advertisement


శ్రీలక్ష్మి పేరుకే హీరో అమర్నాథ్ కూతురు. పూట గడవడం కోసం సినిమాల్లో నటిస్తూ వస్తోంది. కాస్త సినిమాల్లో సెట్ అయింది అనే సమయంలో తండ్రిని తర్వాత ముగ్గురు తోబుట్టువులను ఒక్కొక్కరిగా కోల్పోయి గుండె నిబ్బరం చేసుకొని వారి కుటుంబాలను పోషిస్తూ వస్తోంది. ఈ విధంగా వారి కుటుంబ బాధ్యతలు చూసుకున్న ఈవిడ పెళ్లి లేకుండా ఒంటరిగా జీవిస్తోంది.
#3. గీతా సింగ్:


నేటి తరానికి తెలిసిన లేడీ కమెడియన్ గీతా సింగ్. ఇండస్ట్రీలో కాస్త సెట్ అయిన తర్వాత తన తోడబుట్టిన సోదరుడు మరణించాడు. తను పెళ్లి చేసుకోకుండా సోదరుడి కుటుంబాన్ని అన్ని తానై చూసుకుంటుంది.
ఇంకా వీరే కాకుండా కమెడియన్ రమాప్రభ, యాంకర్ ఝాన్సీ, మరో కమెడియన్ జయలలిత పెళ్లిళ్లు చేసుకున్నా గానీ విడాకులు తీసుకొని ఆ తర్వాత వారి వారి కుటుంబాలను పోషించుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

Also read;హీరో గోపిచంద్ భార్య ఎవ‌రో తెలుసా..? వాళ్ల ప్రేమక‌థ‌లో ఇన్ని ట్విస్ట్ లు ఉన్నాయా..?

Visitors Are Also Reading