Home » టాలీవుడ్ లో సిక్స్ ప్యాక్ బాడీ కలిగిన హీరోలు వీరే…!

టాలీవుడ్ లో సిక్స్ ప్యాక్ బాడీ కలిగిన హీరోలు వీరే…!

by AJAY
Ad

ఒకప్పుడు సిక్స్ ప్యాక్ అంటే బాలీవుడ్ పేరే వినిపించేది కానీ ఆ తర్వాత అన్ని ఇండస్ట్రీలోనూ హీరోలు బాడీ బిల్డింగ్ చేయడం మొదలుపెట్టారు.

Advertisement

దాదాపు ప్రతి ఒక్క హీరో సిక్స్ ప్యాక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే మన టాలీవుడ్ లోనూ పలువురు హీరోలు సిక్స్ ప్యాక్ బాడీతో అభిమానులను ఆకట్టుకున్నారు. అలా చొక్కా విప్పి బాడీ చూపించిన హీరౌలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

అల్లు అర్జున్ దేశముదురు సినిమా లో షర్ట్ లెస్ గా కనిపించాడు. సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించిన బన్నీ కి అభిమానులు ఫిదా అయ్యారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు చాలా సినిమాల్లో షర్ట్ లెస్ గా కనిపించాడు. అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం మరోసారి కండల దేహాన్ని బయటపెట్టాడు.

Advertisement

ప్రభాస్ బాహుబలి సినిమాతో సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించాడు. ఈ సినిమాలో ప్రభాస్ షర్ట్ లెస్ గా శివలింగం మోసే సీన్ బాలీవుడ్ ను సైతం ఫిదా చేసింది.

రామ్ చరణ్ కూడా సిక్స్ ప్యాక్ తో ఆకట్టుకున్నాడు. బాలీవుడ్ సినిమా జంజీర్ లో మొదటి సారి షర్ట్ లెస్ గా కనిపించాడు. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ కోసం మరోసారి షర్ట్ లెస్ గా కనిపిస్తున్నాడు.

విజయ్ దేవరకొండ లైగర్ సినిమా కోసం భారీగా వర్క్ ఔట్ లు చేసి బాడీ పెంచాడు. ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమా టీజర్ లో రౌడీ లుక్ ఆకట్టుకుంటోంది.

అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వం లో రాబోతున్న ఏజెంట్ సినిమా కోసం మొదటి సారి సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపిస్తున్నాడు.

మొదటి సినిమా ఆర్ ఎక్స్ 100 లోనే హీరో కార్తికేయ సిక్స్ ప్యాక్ లుక్ తో ప్రేక్షకులను ఫిదా చేశాడు. ఇక ఈ హీరోలతో పాటు టాలీవుడ్ లో చాలా మంది హీరోలు సిక్స్ ప్యాక్ బాడీని కలిగి ఉన్నారు.

Visitors Are Also Reading