ప్రస్తుతం పాన్ సినిమాల హవా కనిపిస్తోంది. హీరోకు లేదా డైరెక్టర్ కు కొద్దిగా క్రేజ్ ఉంటే చాలు సినిమాలను ఒకేసారి అన్ని భాషల్లో విడుదల చేస్తూ పాన్ ఇండియా సినిమా అని చెప్పుకుంటున్నారు. అయితే బాహుబలి కి ముందు పాన్ ఇండియా సినిమా అనే పదమే వినిపించలేదు. ఇక ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలను మరో భాషలో డబ్బింగ్ చేసేవారు.
Advertisement
అంతేకాకుండా సినిమా కథ నచ్చితే ఇతర ఇండస్ట్రీలకు చెందిన హీరోలు రీమేక్ హక్కులు సొంతం చేసుకుని తమ నేటివిటీకి తగినట్టుగా తెరకెక్కించేవారు. ఇక ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను రీమేక్ చేసే ట్రెండ్ ఇప్పుడు మొదలైంది కాదు. ఎన్టీఆర్ ఏఎన్నార్ కాలంలోనే ఈ ట్రెండ్ మొదలైంది. అంతేకాకుండా ఇప్పటివరకు ఈ ట్రెండ్ కొనసాగుతూ వచ్చింది. అయితే ఇప్పటి హీరోలే ఎక్కువగా రీమేక్ సినిమాలలో నటించారని అనుకుంటారు.
Read Also: రాజమౌళి కెరీర్ లో నష్టాలు వచ్చిన ఒకే ఒక్క సినిమా ఏదో తెలుసా..? అలా ఎందుకు జరిగిందంటే..?
కానీ అందరికంటే ఎక్కువగా అన్నగారు ఎన్టీఆర్ ఒకప్పుడే ఏకంగా 50 సినిమాలను రీమేక్ చేశారు. ఇందులో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. ఇప్పటివరకు ఆ రికార్డును టాలీవుడ్ లో మరెవరు బ్రేక్ చేయలేదు. అంతేకాకుండా అక్కినేని నాగేశ్వరరావు ఏకంగా 42 సినిమాలను రీమేక్ చేశారు.
Advertisement
Read Also: సినిమాల్లో వచ్చిన ఒకటి రెండు సీన్స్ కోసం మళ్లీ మళ్లీ చూడాలనిపించే 5 సినిమాలు ఇవే..?
మరోవైపు విక్టరీ వెంకటేష్ 25 సినిమాలను రీమేక్ చేశారు. అదేవిధంగా ఇటీవల స్వర్గస్తులైన రెబల్ స్టార్ కృష్ణంరాజు ఏకంగా 25 సినిమాలను రీమేక్ చేసి తెలుగులో విడుదల చేశారు. ఇక రీసెంట్ గా చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా చిరంజీవి తన కెరీర్ లో మొత్తం 17 రీమేక్ సినిమాలలో నటించాడు. అంతేకాకుండా నటసింహం నందమూరి బాలకృష్ణ ఏకంగా 12 సినిమాలను రీమేక్ చేశాడు.
అదేవిధంగా నాగార్జున కూడా 12 రీమేక్ సినిమాలలో నటించాడు. ఇక సూపర్ స్టార్ కృష్ణ కూడా అప్పటి హీరోలతో పోలిస్తే తక్కువగా 11 రీమేక్ సినిమాల్లో మాత్రమే నటించాడు. ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు రీమేక్ సినిమాతోనే మళ్లీ లైఫ్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ రీమేక్ తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పటి హీరోలలో పవన్ ఎక్కువగా 10 రీమిక్ సినిమాలో నటించాడు.
Read Also: నయనతార దంపుతులు భలే ప్లాన్ చేసారు ..! సరోగసి కేసు నుంచి తప్పించుకునేందుకు …!