Home » టాలీవుడ్ హీరోల అసలు పేరు ఏమిటో మీకు తెలుసా..?

టాలీవుడ్ హీరోల అసలు పేరు ఏమిటో మీకు తెలుసా..?

by Anji
Published: Last Updated on
Ad

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇక ప్రేక్షకులందరికీ నటీనటులు సుపరిచితులు గా మారి పోతూ ఉంటారు. ఇక వారి పేర్లు అందరికీ గుర్తుండిపోతాయి. ఈ క్రమంలోనే హీరోల గురించి చెప్పమంటే అందరూ తక్కువ ఉంటారు. కానీ హీరోల అసలు పేరు ఏంటి అన్నది మాత్రం చాలా తక్కువ మంది ప్రేక్షకులకు మాత్రమే తెలిసి ఉటుంది. చాలా మటుకు హీరోలు వారి నిజమైన పేరుతో కాకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత స్క్రీన్ నేమ్ అంటూ సాయి కొత్త పేరు పెట్టుకుంటూ ఉంటారు. టాలీవుడ్ లో చాలామంది ఉన్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

మెగాస్టార్ చిరంజీవి:


ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి ఇక ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకు మూలస్తంభంగా సాగిపోతున్నారు. చిరంజీవి చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయన పేరు చిరంజీవి గా మారిపోయింది.

సూపర్ స్టార్ కృష్ణ:


తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ కు నాంది పలికి తెలుగు ప్రేక్షకులు సూపర్ స్టార్ గా మారిపోయారు. కృష్ణ ఇక ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు మహేష్ బాబు కూడా టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నాడు. ఇక మరో కుమారుడు నరేష్ సినిమా లోనే ఉన్నాడు. సూపర్ స్టార్ కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ ఇక పేరు కాస్త పెద్దగా ఉండడంతో షార్ట్ కట్ లో కృష్ణ అనే స్క్రీన్ నేమ్ పెట్టుకున్నారు ఆయన.

పవన్ కళ్యాణ్:

Advertisement


చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అప్పటికీ అటు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని టాలీవుడ్ పవర్ స్టార్ గా మారిపోయాడు. పవన్ కళ్యాణ్. ఇక సినిమా హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఎంతో మంది అభిమానులు పవన్ కళ్యాణ్ కు ఉంటారు. పవన్ కళ్యాణ్ అసలు పేరు కొణిదెల కళ్యాణ్.
నాని:

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ డైరెక్టర్ అవుదామని వచ్చి ఇక హీరోగా మారిపోయిన నాని ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల నాచురల్ స్టార్ గా కొనసాగుతున్నాడు. అయితే నాని అసలు పేరు గంటా నవీన్ బాబు.
ప్రభాస్:


రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ఈశ్వర్ అనే సినిమాతో కెరీర్ ప్రారంభించిన ప్రభాస్ ప్రస్తుతం ఇండియా స్టార్ గా కొనసాగుతున్నాడు. ప్రభాస్ అసలు పేరు చాలా మందికి తెలియదు ఇంతకీ అసలు పేరు ఏంటంటే ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు. ఇక ఇంత పెద్ద పేరు సినిమాలో బాగుండదని ఇక ప్రభాస్ గా తన పేరు మార్చుకున్నాడు.
రజినీకాంత్:


భారతీయ మన చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్ సినిమాల్లోకి వచ్చిన తర్వాత రజినీకాంత్ గా మారిపోయింది. ఇక వీరితో పాటు మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు. ఇక కమలహాసన్అసలు పేరు పార్థసారథి శ్రీనివాసన్. రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. జగపతి బాబు అసలు పేరు వీరమాచినేని జగపతిరావు. సునీల్ అసలు పేరు సునీల్ వర్మ. మమ్ముట్టి అసలు పేరు మొహమ్మద్ కుట్టి పని పరంబాల్ ఇస్మాయిల్.

Visitors Are Also Reading