Home » TOLLYWOOD : ఒకే సినిమా చేసి మాయ‌మైన టాల‌వుడ్ ముద్దుగుమ్మ‌లు వీరే…!

TOLLYWOOD : ఒకే సినిమా చేసి మాయ‌మైన టాల‌వుడ్ ముద్దుగుమ్మ‌లు వీరే…!

by AJAY
Ad

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కొంతమంది భామ‌లు స‌క్సెస్ అయితే ఆ త‌ర‌వాత వ‌రుస సినిమాలు చేస్తారు. అదృష్టం క‌లిసి వ‌స్తే స్టార్ హీరోయిన్ గా కూడా ఎదుగుతారు. ఇక మ‌రికొంద‌రు హీరోయిన్ లు కొన్ని సినిమాలు చేసి ఆ త‌ర‌వాత క‌నుమ‌రుగ‌వుతారు. కానీ టాలీవుడ్ లో కొంత‌మంది ముద్దుగుమ్మ‌లు ఒకే ఒక్క సినిమా చేసి ఆ త‌ర‌వాత క‌నిపించ‌కుండా పోయారు. అలా ఒకే సినిమా చేసి క‌నిపించ‌కుండాపోయిన హీరోయిన్లు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం….

ర‌వితేజ హీరోగా క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కిన సినిమా నేల‌టికెట్టు. ఈ సినిమాలో మాళ‌విక శ‌ర్మ హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. ఆ త‌ర‌వాత రామ్ హీరోగా రెడ్ సినిమాతో ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అవ్వ‌డంతో క‌నుమ‌రుగైంది.

Advertisement


త్రివిక్ర‌మ్ క‌థ మాట‌లు అందించి రామ్ ప్ర‌సాద్ దర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా చిరున‌వ్వుతో. ఈ సినిమా ష‌హీన్ హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. కానీ ఈ సినిమా త‌ర‌వాత ఆశించిన మేర ఆఫ‌ర్లు రాక‌పోవ‌డంతో టాలీవుడ్ కు దూర‌మైంది.

Advertisement


ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా ఎస్ జే సూర్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా కొమురంపులి. ఈ సినిమాలో నిఖిషా ప‌టేల్ హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ త‌ర‌వాత క‌ల్యాణ్ రామ్ తో ఓం అనే సినిమాలో న‌టించ‌గా అది కూడా ఫ్లాప్ అవ్వ‌డంతో ఆ త‌ర‌వాత ఇండ‌స్ట్రీకి దూర‌మైంది.


బాల‌య్య పూరిజ‌గ‌న్నాత్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన సినిమా పైసా వ‌సూల్. ఈ సినిమాలో ముస్కాన్ సేతి హీరోయిన్ గా నటించింది. కానీ ఈ సినిమా త‌ర‌వాత అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో సినిమాల‌కు దూర‌మైంది.


పూరి జ‌గ‌న్నాత్ క‌ల్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన సినిమా ఇజం. ఈ సినిమాలో అదితి ఆర్య హీరోయిన్ గా న‌టించింది. కానీ ఈ సినిమా త‌ర‌వాత అదితి మ‌ళ్లీ టాలీవుడ్ లో క‌నిపించ‌లేదు.

Visitors Are Also Reading