Home » 30 దాటి 40 ఏళ్లు వ‌స్తున్నా పెళ్లి చేసుకోని టాలీవుడ్ బ్యూటీలు..!

30 దాటి 40 ఏళ్లు వ‌స్తున్నా పెళ్లి చేసుకోని టాలీవుడ్ బ్యూటీలు..!

by AJAY
Ad

ఒక‌ప్ప‌టి హీరోయిన్ లు సినిమా అవ‌కాశాలు త‌గ్గాయంటే పెళ్లి చేసుకుని సినిమాల‌కు దూరంగా ఉండేవారు. కొంత‌మంది మాత్రం లేటు వ‌య‌సులో పెళ్లిళ్లు చేసుకునేవారు. కానీ ఇప్పటి చాలా మంది హీరోయిన్ లు లేటు వ‌య‌సులో వివాహాలు చేసుకుంటున్నారు. 30 ఏళ్లు దాటి 40 ఏళ్ల ద‌గ్గ‌ర‌కు వస్తున్నా బ్యాచిల‌ర్ లైఫే సో బెట‌ర్ అంటున్నారు. అలా ఇండ‌స్ట్రీలో 40ఏళ్ల ద‌గ్గ‌రికి వ‌స్తున్నా పెళ్లి చేసుకోని హీరోయిన్ లు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం.

Anushka Shetty

Anushka Shetty

టాలీవుడ్ లో ఏజ్ పెరిగినా వివాహానికి దూరంగా ఉన్న హీరోయిన్ ల విష‌యానికి వ‌స్తే ముందుగా వినిపించేది అనుష్క శెట్టి పేరు. ఈ బ్యూటీ వ‌య‌సు ఇప్ప‌టికే 40కి చేరింది. కానీ అనుష్క పెళ్లి ఊసే ఉండ‌దు.

Advertisement

Nayanatara Vignesh shivan

Nayanatara Vignesh shivan

టాలెంటెడ్ హీరోయిన్ న‌య‌న‌తారకు 37 ఏళ్లు వ‌చ్చాయి. న‌య‌నతార విగ్నేష్ శివ‌న్ అనే త‌మిళ ద‌ర్శ‌కుడితో ప్రేమ‌లో ఉంది. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ పెళ్లి చేసుకోలేదు కాబ‌ట్టి బ్యాచిల‌ర్ లిస్ట్ లోనే ఉంది.

Advertisement

టాలీవుడ్ లో మరోబ్యాచిల‌ర్ హీరోయిన్ త్రిష‌. ఈ ముద్దుగుమ్మ వ‌య‌సు ఇప్ప‌టికే 37కు చేరుకుంది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కూ త్రిష పెళ్లి పై ఎలాంటి వార్త‌లు వినిపించ‌వు.


మిల్కీ బ్యూటీ త‌మన్నా వ‌య‌సు ముప్పై దాటి 32కు చేరింది. అయిన‌ప్ప‌టికీ త‌మ‌న్నా వ‌రుస సినిమాలు చేస్తూ పెళ్లికి దూరంగా ఉంది.

pooja hegde

pooja hegde

బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే అల‌వైకుంఠపురం సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా త‌ర‌వాత పూజా వ‌రుస సినిమాల‌తో స్టార్ హీరోయిన్ గా ఫుల్ బీగా ఉంది. ఇక 31ఏళ్ల పూజా హెగ్డే ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు క‌నిపించ‌డంలేదు.

Visitors Are Also Reading