Tollywood heroes: చాలామంది సెలబ్రిటీలు ఒకరిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అలా పెళ్లి చేసుకున్న చాలామంది సెలబ్రిటీలు విడిపోయారు. ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ నటులు చాలామంది ఉన్నారు. అలా ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న నటుల వివరాలను ఇప్పుడు చూద్దాం.. సీనియర్ ఎన్టీఆర్ మొదట బసవతారకాన్ని పెళ్లి చేసుకున్నారు. ఆమె చనిపోయిన తర్వాత 70 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ వివాహం అప్పట్లో సంచలనంగా మారింది. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కూడా తీవ్ర ప్రభావాన్ని చూపించింది. అప్పటికి లక్ష్మీపార్వతి కి పెళ్లి అయిపోయే ఒక కొడుకు కూడా ఉన్నాడు. సూపర్ స్టార్ కృష్ణ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు.
Advertisement
సూపర్ స్టార్ కృష్ణ మొదటి వివాహం మహేష్ బాబు తల్లి అయిన ఇందిరా దేవితో జరిగింది ఆమెతో దాంపత్య జీవితం కొనసాగుతుండగానే విజయనిర్మలతో ప్రేమలో పడి, ఆమెని పెళ్లి చేసుకున్నారు. అప్పటికే విజయనిర్మలకి కూడా వివాహం అయిపోయింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు భార్య సీతాదేవి ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు. దీంతో శ్యామల దేవిని రెండవ పెళ్లి చేసుకున్నారు కృష్ణంరాజు. హీరో శరత్ బాబు ఒకటి కంటే రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ముందుగా తనకంటే వయసులోని పెద్దదైనా రమాప్రభని 1974లో పెళ్లి చేసుకున్నారు ఆమెతో మనస్పర్ధలు రావడంతో 1988లో విడాకులు తీసుకున్నారు.
Advertisement
తర్వాత స్నేహా నంబియార్ ని 1990లో పెళ్లి చేసుకున్నారు శరత్ బాబు. ఆమెకి కూడా 2011లో విడాకులు ఇచ్చేశారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు 1994లో లలితా కుమారిని పెళ్లి చేసుకున్నారు. కొన్ని సమస్యల కారణంగా ఆమెకి దూరమై 2010లో పోనీవర్మని పెళ్లి చేసుకున్నారు. కమల్ హాసన్ 1978లో వాణి గణపతిని పెళ్లి చేసుకున్నారు. 1988 లో ఆమెకి విడాకులు ఇచ్చేసారు. సారిక ని రెండో పెళ్లి చేసుకున్నారు. 2004లో సారికతో విడిపోయారు. చాలా కాలం గా గౌతమితో సహజీవనం చేస్తున్నారు కమల్ హాసన్.
Also read:
- ఉదయ్ కిరణ్తో చిరంజీవి తన కూతురు పెళ్లి ఎందుకు రద్దు చేసుకున్నాడో తెలుసా..?
- HanuMan Total Collections: హనుమాన్ సినిమాకి ఎన్ని వందల కోట్లు లాభమో తెలుసా..?
- బాలకృష్ణ, హరికృష్ణలు కలిసి నటించిన 3 సినిమాలు!
నందమూరి హరికృష్ణ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. 1973లో లక్ష్మీని పెళ్లి చేసుకున్నారు కొన్ని సంవత్సరాల తర్వాత 1980లో షాలిని పెళ్లి చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ 1997లో మొదట పెళ్లి చేసుకున్నారు. తర్వాత 2008లో నందిని తో విడిపోయారు. తర్వాత రేణు దేశాయ్ ని 2009లో పెళ్లి చేసుకున్నారు. 2012లో ఆమెతో కూడా విడిపోయారు 2013లో అన్నలెజెనోవా ని పెళ్లి చేసుకున్నారు. నాగార్జున మొదట లక్ష్మిని పెళ్లి చేసుకున్నారు తర్వాత ఆమెకి విడాకులు ఇచ్చేసారు. 1992లో హీరోయిన్ అమలని పెళ్లి చేసుకున్నారు నాగార్జున. ఇలా టాలీవుడ్ లో పలువురు నటులు ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!