రామాయణం ఎప్పుడూ కూడా ఒక మంచి సబ్జెక్టు. దీని గురించి ఇప్పటికే చాలా సినిమాల్లో చూపించారు. ఈ కాలంలో కూడా రామాయణం ఆధారంగా సినిమాలు తీస్తున్నారు. ఓ మూవీకి కావాల్సిన అన్ని టాపిక్స్ ఉన్న ఇతిహాసం ఇది. ప్రతి హీరో జీవితంలో ఒక్కసారి అయినా రాముని పాత్ర చేయాలని ఉంటుంది. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు.
Advertisement
రాముని జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిని ఇస్తుంది. వాల్మీకి రాసిన రామాయణానికి వందల మంది దర్శకులు వెండితెర రూపాన్ని ఇవ్వడం జరిగింది.
Advertisement
అయితే అసలు ఇప్పటికే చాలా మంది రాముడు పాత్రలలో నటించారు. కానీ మొట్టమొదట రాముడు పాత్రలో నటించిన ఎవరో మీకు తెలుసా…? 1932లో శ్రీరామ పాదుకాపట్టాభిషేకం టైటిల్ తో ఓ సినిమా వచ్చింది. ఈ మూవీలో నటుడు ఎడవల్లి సూర్యనారాయణ రాముని కింద నటించారు. తెలుగులో రాముడిగా నటించిన మొదట నటుడుగా రికార్డులు ఎక్కారు.
Also read:
1945లో పాదుకాపట్టాభిషేకం పేరుతో ఇంకో చిత్రం వచ్చింది. ఈ మూవీలో సి ఎస్ ఆర్ ఆంజనేయులు రాముడి కింద నటించారు ఎన్టీఆర్ కంటే ముందు రాముడుగా ఏఎన్ఆర్ నటించడం విశేషం. సీతారామ జననం మూవీ లో ఏఎన్నార్ రాముడుగా నటించడం జరిగింది. రాముని పాత్రలకు ఎన్టీఆర్ ఫేమస్ అయిన తర్వాత ఏఎన్నార్ చేయలేదు. పౌరాణిక పాత్రలకు ఎన్టీఆర్ పెట్టింది పేరు అందులో రాముని పాత్రకు ఆయన జీవించేస్తారు.