Home » బైక్ నడపడం రాని ఆ టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా… తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే..!

బైక్ నడపడం రాని ఆ టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా… తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే..!

by AJAY
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటులు అద్భుతమైన రీతిలో బైక్ లను నడుపుతారు అన్న విషయం మన అందరికీ తెలిసిందే. అలాగే కొంతమంది హీరోలు అయితే బైక్ నడపడం చాలా ఇష్టం ఉండటంతో అలా బైక్ లతో రోడ్డు మీదకు వెళ్లినట్లు అయితే అభిమానుల నుండి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని నైట్ పూట హెల్మెట్ పెట్టుకొని ప్రశాంతంగా బైక్ డ్రైవ్ చేసేవారు కూడా అనేకమంది ఉన్నారు.

Advertisement

అంతలా కొంతమంది తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందినవారు బైకులను నడపడానికి ఇష్టపడుతుంటారు. ఇది ఇలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని… తెలుగుతో పాటు ఇతర భాష సినిమాల్లో కూడా నటించి దేశవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న ఒక తెలుగు నటుడికి బైక్ నడపడం రాదు. ఈ విషయాన్ని ఆ అన్నటుడే తాజాగా స్వయంగా చెప్పుకొచ్చాడు. ఆ నటుడు ఎవరా అని అనుకుంటున్నారా… ఆయనే మరెవరో కాదు దగ్గుపాటి రానా.

Advertisement

ఈ నటుడు లీడర్ మూవీతో వెండితెరకు పరిచయం అయ్యి… నేనే రాజు నేనే మంత్రి మూవీతో సోలోగా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొంతకాలం క్రితం బాహుబలి సిరీస్ మూవీలో విలన్ పాత్రలో నటించిన రానా ఈ మూవీతో ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇంతటి క్రేజ్ కలిగిన ఈ హీరోకు బైక్ నడపడం రాదు. ఈ విషయాన్ని తాజాగా ఈయన ఒక సినిమా ఫంక్షన్ లో చెప్పుకొచ్చాడు.

కొంతకాలం క్రితమే రానా తన బాబాయ్ అయినటువంటి వెంకటేష్ తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. మరికొన్ని రోజుల్లో ఈ నటుడు తేజ దర్శకత్వంలో రూపొందబోయే మూవీలో హీరోగా నటించబోతున్నాడు.

Visitors Are Also Reading