Telugu News » దాస‌రి నారాయ‌ణ‌రావు కుమారుడు అరెస్ట్‌..!

దాస‌రి నారాయ‌ణ‌రావు కుమారుడు అరెస్ట్‌..!

by Anji

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌ను ఒక‌స్థాయిలో నిల‌బెట్టిన ద‌ర్శ‌కుల‌లో దాస‌రి నారాయ‌ణ‌రావు ఒక‌ర‌ని చెప్పుకోవ‌చ్చు. టాలీవుడ్‌ ఇండ‌స్ట్రీకి ఆయ‌న చేసిన సేవ‌లు అలాంటివి మ‌రి. ఆయ‌న సంపాదించుకున్న అంత గొప్ప పేరును ఆయ‌న కుమారులే తుడిచేయ‌డం క‌డు బాధాక‌రం. దాస‌రి కొడుకులు.. ఆయ‌న మృతి చెందిన త‌రువాత ఆస్తి గొడ‌వ‌ల‌తో రొడ్డుకెక్కిన విష‌యం విధిత‌మే. దాస‌రి చిన్న కొడుకు నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటాడు. మొన్నా మ‌ధ్య స్థ‌లం గొడ‌వ‌లో ఒక‌రిని చంపేస్తాన‌ని బెదిరించిన వివాదం నుంచి తేరుకోక‌ముందే మ‌రొక వివాదంలో అరుణ్ చిక్కుకున్నారు.

Ads

Dasari Arun Kumar plays baddie in Allu Sirish's next

గురువారం తెల్ల‌వారుజామున త‌ప్ప‌తాగి కారు డ్రైవ్ చేసి రెండు ద్విచ‌క్ర వాహ‌నాల‌ను ఢీ కొట్టాడు. బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో స‌య్య‌ద్‌న‌గ‌ర్‌లో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రెండు బైకుల‌ను ఢీ కొట్టిన‌ట్టు తెలుస్తోంది. అప్ప‌టికే అరుణ్ మ‌ద్యం సేవించి న‌డుపుతున్న‌ట్టు పోలీసులు గుర్తించారు. వెంట‌నే పోలీసులు బ్రీత్ అన‌లైజ‌ర్ ప‌రీక్ష చేయ‌గా 405 సూచించింద‌ని.. వెంట‌నే ఆయ‌న‌ను అరెస్ట్ చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. అరుణ్ పై కేసు న‌మోదు చేసి.. సీసి టీవీ పుటేజ్‌ని ప‌రిశీలిస్తున్న‌ట్టు వెల్ల‌డించారు. దాస‌రి అరుణ్ హీరోగా కూడా ప‌లు సినిమాల్లో న‌టించాడు. దాస‌రి నారాయ‌ణ‌రావు ప‌రువును బ‌జారుకీడుస్తున్నార‌ని ప‌లువురు సీనియ‌ర్లు తిడుతున్నారు.


You may also like