Home » టాలీవుడ్ ఫస్ట్ సూపర్ గర్ల్ మూవీ ఏమిటో తెలుసా..?

టాలీవుడ్ ఫస్ట్ సూపర్ గర్ల్ మూవీ ఏమిటో తెలుసా..?

by Anji
Ad

స్టాన్లీ సుమ్‌బాబు, నిర్మాణ సారథ్యంల స్టీఫెన్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ తెర‌కెక్కించినున్న అడ్వెంచ‌ర్ మూవీ ఇంద్రాణి తెలుగు తెర‌పై గ‌తంలో ఎన్న‌డూ చూడ‌ని డిఫ‌రెంట్ పాయింట్ ఎంచుకొని ఈ సినిమాను రూపొందించ‌బోతున్న‌ట్టు ద‌ర్శ‌క నిర్మాత‌లు పేర్కొంటున్నారు. యాక్ష‌న్ సన్నివేశాల‌కు తోడు క‌మ‌ర్షియ‌ల్ హంగులు జోడించి ఓ సూప‌ర్ గ‌ర్ల్ స్టోరీగా ఇది తెర‌కెక్క‌బోతున్న‌దని వారు అన్నారు. ఈ మూవీ గురించి వారు మ‌రింత‌గా తెలియ‌జేస్తూ ఓ కెప్టెన్ మార్వెల్, ఓవండ‌ర్ విమెన్ లాంటి క్యారెక్ట‌ర్‌తో రంగంలోకి దిగ‌బోతున్న‌ది. లీడ్ రోల్ పోషిస్తున్న హీరోయిన్‌కు సూప‌ర్ ప‌వ‌ర్ ఉంటున్న‌ది. ఆమెతో పాటు క‌థ అంతా ట్రావెల్ మ‌రొక ఇద్ద‌రూ హీరోయిన్ల‌కు ఈసినిమాలో స్కోప్ ఉన్న‌దని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు వెల్ల‌డించారు.

indrani

Advertisement

Advertisement

ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న స్టీఫెన్ న్యూయార్క్ ఫిలిం అకాడ‌మీలో ట్రైనింగ్ చేసి అక్క‌డే రెండున్న‌ర సంవ‌త్స‌రాల పాటు స్క్రిప్ట్‌పై క‌స‌ర‌త్తులు చేసి స్క్రీన్‌ప్లే ఎలా ఉండాలి.? చాలా గ్రాండ్‌గా వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ ఎలా జ‌ర‌గాలి. అనేదానిపై ఓ అంచ‌నాకొచ్చారు. ఆ త‌రువాత ఇండియాలో మ‌రొక మూడు నెల‌లు రీసెర్చ్ చేసి సూప‌ర్ అవుట్‌పుట్ ని ఆడియ‌న్స్ ముందు ఉంచ‌డ‌మే ల‌క్ష్యంగా ఇప్పుడు రంగంలోకి దిగుతున్నారు.

ఇప్ప‌టికే ఈ సినిమా టైటిల్‌, బ్యాన‌ర్ నేమ్ రిజిస్టర్ చేసి ఫ్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా ఫినిష్ చేసారు. షూటింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌పై ప్ర‌ణాళిక ర‌చించి రెడీగా ఉన్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. భారీ కాస్టింగ్‌తో పాటు కొత్త నటీన‌టులను ఈ సినిమాతో ప్రోత్స‌హించ‌బోతున్నారు. సాయికార్తీక్ అందించ‌బోతు్న మ్యూజిక్‌ సినిమాలో హైలెట్ కానున్న‌ద‌ని నిర్మాత పేర్కొన్నారు.

Visitors Are Also Reading