Home » ఈ 6 సినిమాల్లో తండ్రీ కొడుకుల సెంటిమెంట్ వేరే లెవల్..చూస్తే కన్నీళ్లు ఆగవు…!

ఈ 6 సినిమాల్లో తండ్రీ కొడుకుల సెంటిమెంట్ వేరే లెవల్..చూస్తే కన్నీళ్లు ఆగవు…!

by AJAY
Published: Last Updated on
Ad

తల్లి సెంటిమెంట్ తో చాలా సినిమాలు వస్తాయి. కానీ తండ్రి సెంటిమెంట్ తో వచ్చే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి.  అయితే టాలీవుడ్ లో వచ్చిన కొన్ని సినిమాల్లో తండ్రి కొడుకుల మధ్య సెంటిమెంట్ చూస్తే కన్నీళ్లు ఆగవు. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం..

Advertisement

విక్టరీ వెంకటేష్ త్రిష హీరో హీరోయిన్లు గా నటించిన సినిమా ఆడవారి మాటలకు అర్థాలు వేరులే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో వెంకటేష్ కు తండ్రిగా కోట శ్రీనివాసరావు నటించారు. సినిమాలో కోట… వెంకటేష్ ను తిడుతూనే అతడిపై చూపించే ప్రేమ మాటల్లో చెప్పలేం. తన కొడుకు సంతోషం కోసం అవమానాలు ఎదుర్కొన్న కోట చివరికి మరణిస్తారు. ఆ తర్వాత తన తండ్రి విలువ తెలిసి వెంకటేష్ బాధపడతారు. ఈ సీన్లు ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తాయి.

సిద్ధార్థ్ జెనీలియా హీరో హీరోయిన్లుగా నటించిన బొమ్మరిల్లు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ముఖ్యంగా ఫాదర్ సెంటిమెంట్ తోనే నడుస్తుంది. సినిమాలో తన కొడుకును ఎంతో ప్రేమించే ప్రకాష్ రాజ్ అన్నీ తానే దగ్గరుండి చూసుకుంటాడు. ఈ క్రమంలో సిద్దార్థ్ తన స్వేచ్ఛను కోల్పోతాడు. చివరికి ప్రకాష్ రాజ్ చేస్తున్న తప్పును సిద్ధార్థ్ వివరించే తీరు ఆ సమయంలో వచ్చే సీన్లు వేరే లెవెల్ లో ఉంటాయి.

వెకటేష్ ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా నువ్వు నాకు నచ్చావ్. ఈ సినిమాలో కూడా తండ్రి కొడుకుల సెంటిమెంట్ ఓ రేంజ్ లో ఉంటుంది. చిన్నప్పటినుండి తల్లి లేకుండా పెరిగిన వెంకటేష్ ను చంద్రమోహన్ గారాబం చేస్తాడు. ఈ క్రమంలో వెంకటేష్ జులాయి గా మారిపోతాడు. ఫస్టాఫ్ లో ఈ సినిమాలో కామెడీ సీన్లు ఉంటే సెకండాఫ్ లో తండ్రి కొడుకుల సెంటిమెంట్ ప్రేక్షకులను అలరిస్తుంది.

Advertisement

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సుస్వాగతం సినిమాలో ఆయనకు తండ్రిగా రఘువరన్ నటించాడు. పవన్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని తెలుసుకుని అతడికి ఒక ఫ్రెండ్ లా హెల్ప్ చేసే పాత్రలో రఘువరన్ జీవించారు. చివరకు తన తండ్రి మరణించిన సమయంలో కూడా పవన్ పక్కన ఉండరు. ఆ తర్వాత తండ్రి శవాన్ని కూడా చూడలేక కుమిలిపోతూ ఏడ్వడం చూస్తే కన్నీళ్లు ఆగవు.

ఇంటర్మీడియట్ చదివే విద్యార్థి మనసును అర్థం చేసుకుని ఒక తండ్రి ఎలా ఉండాలో చెప్పే సినిమా కొత్త బంగారులోకం. ఈ సినిమా లో వరుణ్ సందేశ్ హీరోగా నటించగా ప్రకాష్ రాజ్ తండ్రిగా ప్రకాష్ నటించారు. ఈ సినిమాలో కూడా ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ కన్నీళ్లు పెట్టిస్తుంది.

ఎన్టీఆర్ హీరోగా నటించిన నాన్నకు ప్రేమతో సినిమా.. నాన్న ప్రేమను బేస్ చేసుకునే కథతో తెరకెక్కింది. తన తండ్రిని దెబ్బ కొట్టిన వాడిని ఎన్టీఆర్ ఎలా ఎదుర్కొంటాడు అనేది ఈ సినిమా కథ. సినిమాలో తండ్రి బెడ్ పై ఉన్నప్పుడు వాళ్లిద్దరి మధ్య ఉండే సీన్లు కన్నీళ్లు పెట్టిస్తాయి.

Also read :

తిరుమ‌ల‌లో మ‌న‌కి నిత్యం వినిపించే ‘ఓం న‌మో వేంక‌టేశాయ’ ఆ గొంతు ఎవ‌రిదో తెలుసా..?

మహేష్ బాబు అందం సీక్రెట్స్ “పాన్ బహార్ గుట్కా, రాయల్ స్టాగ్ విస్కీ” అంటూ నెట్టింట దారుణమైన ట్రోల్స్…!

Visitors Are Also Reading