టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. అక్కడ సక్సెస్ అవ్వాలని కోరిక చాలా మందికి ఉంటుంది. ఇక హీరోయిన్ అవ్వాలంటే కేవలం అందం ఉంటే సరిపోదు.
Advertisement
అదృష్టం కూడా కావాలి. అంతేకాకుండా అందం, అభినయం, అదృష్టం ఇది మూడు ఉండి కూడా ఇండస్ట్రీలో రాణించ లేకపోయినా హీరోయిన్లు ఉన్నారు. దానికి కారణం ఆ హీరోయిన్లు చేసిన చిన్న చిన్న తప్పులే. అయితే టాలీవుడ్ లో బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోయిన్లుగా అట్టర్ ఫ్లాఫ్ అవుతున్న తారల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు, నాగార్జున మేనకోడలైన సుప్రియ యార్లగడ్డ మొదటి సినిమాను పవన్ కళ్యాణ్ తో కలిసి చేసింది. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీలో హీరోయిన్ గా నటించి ఇండస్ట్రీకి పరిచయమైంది. అయితే ఈ సినిమా తర్వాత ఈమెకి అనుకున్న స్థాయిలో హీరోయిన్ గా ఛాన్సులు రాలేదు. కృష్ణ రెండో కూతురు మంజుల కూడా హీరోయిన్ గా అడుగు పెట్టాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ తన కోరికలు నెరవేర్చుకోలేదు.
Advertisement
కమల్ హాసన్ కు ఇద్దరూ ముద్దుల కూతుర్లు ఉన్నారు. ఇందులో ఇప్పటికే హీరోయిన్ గా సత్తా చారుతున్న శృతిహాసన్ కెరియర్ మొదట్లో ఎన్నో ప్లాప్ లను చూసింది. ఇక కమల్ రెండవ కూతురు అక్షర హాసన్ కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఉపయోగం లేదు. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారికను కూడా ప్రేక్షకులు హీరోయిన్ గా ఆదరించలేదు. అలాగే మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి పూర్తి స్థాయిలో హీరోయిన్ గా నటించకపోయినా నటిగా మాత్రం మంచి సత్తా చాటుతోంది. ఎందుకో పూర్తి స్థాయిలో నటిగా ఎక్కువ సినిమాలు చేయలేకపోతోంది. అటు నటుడు శరత్ కుమార్ ముద్దుల తనయ వరలక్ష్మి కూడా హీరోయిన్ గా సత్తా చాటాలని చూసిన కొన్ని సినిమాల తర్వాత ఎందుకో హీరోయిన్ గా రాణించలేకపోయింది.
READ ALSO : రెబల్ స్టార్ ప్రభాస్ ది కూడా విగ్గే…ఇదే సాక్ష్యం ?