Home » టాలీవుడ్ ప్రముఖ నటుడు బాలయ్య మృతి…ఆయన సినీ ప్రస్థానం ఇదే….!

టాలీవుడ్ ప్రముఖ నటుడు బాలయ్య మృతి…ఆయన సినీ ప్రస్థానం ఇదే….!

by AJAY
Ad

టాలీవుడ్లో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు బాలయ్య (94) హైదరాబాద్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. బాలయ్య నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. బాలయ్య ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా వైకుంఠపురం శివారు గ్రామం సేవ పాడు లో గురవయ్య అన్నపూర్ణమ్మ అనే దంపతులకు ఏప్రిల్ 9న 1930లో లో జన్మించారు. మెకానికల్ ఇంజనీరింగ్ లో బీఈ పూర్తి చేశారు. ఆ తర్వాత మద్రాసు కాకినాడ పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్ గా విధులు నిర్వహించారు.

Advertisement

అయితే మద్రాసు కాలేజీలో చదువుకునే రోజుల్లోనే బాలయ్య నాటకాలు వేసే వారు. 1958 లో ఎత్తుకు పై ఎత్తు అనే సినిమా ద్వారా బాలయ్య పరిచయమయ్యారు. ఈ సినిమా తర్వాత భాగ్య దేవత అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత కుంకుమరేఖ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదేవిధంగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నటించిన భూకైలాస్ సినిమా లో బాలయ్య శివుడి పాత్ర‌లో కనిపించి ప్రేక్షకులను అలరించారు.

Advertisement

ఆ తర్వాత లక్ష్మి పార్వతి కళ్యాణం సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఇప్పటి వరకు బాలయ్య మొత్తం 300కు పైగా సినిమాల్లో నటించి ప్రశంసలు అందుకున్నారు. విభిన్న పాత్రల‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సినీలోకంలో తనదైన చెరగని ముద్ర వేసుకున్నారు. 1970లో అమృత ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి నేరము శిక్ష అనే సినిమాను తెరకెక్కించారు. అదేవిధంగా అన్నదమ్ముల కథ, ఈనాటి బంధం ఏనాటిదో లాంటి సినిమాలు కూడా నిర్మించి ప్రశంసలు అందుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాలయ్య నిర్మించిన చెల్లెలికాపురం అనే సినిమాను ఉత్తమ చిత్రంగా ఎంపికచేసి నంది అవార్డును అందజేసింది. అదేవిధంగా బాలయ్య దర్శకత్వంలో ఊరికిచ్చిన మాట, పోలీస్ అల్లుడు లాంటి సినిమాలు వచ్చి మంచి విజయం సాధించాయి. అలా ఎన్నో సినిమాలలో నటించడమే కాకుండా నిర్మాణరంగంలో దర్శకత్వంలో సేవలు అందించిన బాలయ్య పుట్టిన రోజు నాడే కాన‌రాని లోకాలకి వెళ్లిపోవడంతో టాలీవుడ్ లో విషాదం నిండుకుంది. బాలయ్య మరణవార్త విన్న సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు ఆయన మృతిప‌ట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.

Visitors Are Also Reading