Home » తెలుగులో ఛాన్స్ కొటేషన్ “లవ్ టుడే” ముద్దుగుమ్మ.. హీరో ఎవరంటే..?

తెలుగులో ఛాన్స్ కొటేషన్ “లవ్ టుడే” ముద్దుగుమ్మ.. హీరో ఎవరంటే..?

by Sravanthi Pandrala Pandrala

లవ్ డే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ తన అంద చందాలతో నటనా టాలెంట్ తో మెస్మరైజ్ చేసిన ముద్దుగుమ్మ ఇవానా. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈమె గురించే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికీ కుర్ర కారుకు ఎంతో దగ్గరైనా ఈ అందాల భామ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఓ సినిమా ద్వారా అరంగేట్రం చేయబోతోంది.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం..

Actress Ivana 

తమిళ ఇండస్ట్రీలో ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా లవ్ టుడే. కేవలం ఐదు కోట్ల బడ్జెట్ తో మూవీ రాగా 60 కోట్ల కలెక్షన్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. దీంతో ఇండస్ట్రీ చూపు ఒక్కసారిగా ఈ సినిమా హీరోయిన్ పై పడింది. అయితే ఈ మూవీ గత వారం కింద తెలుగులో కూడా లవ్ టుడే పేరుతోనే విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.. అయితే ఈ చిత్రాన్ని స్టార్ నిర్మాత దిల్ రాజ్ విడుదల చేశారు.. ఈ తరుణంలోనే ఆమె టాలెంటును గుర్తించిన దిల్ రాజ్ తెలుగు ఇండస్ట్రీలో మొదటిసారి ఛాన్స్ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

also read:రామ్ చరణ్ నో చెప్పిన కథతో బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రభాస్…ఆ సినిమా ఏదంటే…?

సెల్ఫిష్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన దిల్ రాజ్ మేనల్లుడు ఆశీస్ రెడ్డి ఈ చిత్రంలో హీరోగా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై దిల్ రాజ్, సుకుమార్ ఈ సినిమాని చేయబోతున్నారట. ఇప్పటికీ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ ను ఎంపిక చేశారని, యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ కథను ఇవానాకి వినిపించారని కథ విన్న ఆమె ఓకే కూడా చెప్పినట్టు సమాచారం. అధికారిక ప్రకటన త్వరలోనే రావాల్సి ఉంది.

also read:

Visitors Are Also Reading