Telugu News » Blog » Toliprema Movie Heroine: తొలిప్రేమ హీరోయిన్ కీర్తిరెడ్డి మీకు గుర్తుందా..? ఇప్పుడు ఏం చేస్తుందంటే..?

Toliprema Movie Heroine: తొలిప్రేమ హీరోయిన్ కీర్తిరెడ్డి మీకు గుర్తుందా..? ఇప్పుడు ఏం చేస్తుందంటే..?

by Anji
Ads

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించినటువంటి తొలిప్రేమ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. ముఖ్యంగా పవన్  కెరీర్ లోనే ఓ  మైలురాయిగా నిలిచిన సినిమాల్లో తొలిప్రేమ ఒకటి. 1998లో  విడుదలైన ఈ సినిమా  ఓ ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి.ప్రధానంగా పవన్ కళ్యాణ్ ను యూత్ కి బాగా కనెక్ట్ చేసింది తొలిప్రేమ. అమాయకమైన ప్రేమికుడిగా, ప్రియురాలికి తన ప్రేమ విషయం చెప్పేందుకు తాపత్రయపడే యువకుడి పాత్రలో పవన్ నటన అందరినీ ఆకర్షించింది.  

Advertisement

 

ఇక హీరోయిన్ గా కీర్తి రెడ్డి చేసిన మ్యాజిక్ అద్భుతమనే చెప్పాలి. ముఖ్యంగా ఈ చిత్రంలో హీరోయిన్ ఇంట్రడ్యూస్ సీన్ సినిమాకే హైలెట్. ఇప్పటికీ చాలా సినిమాల్లో ఇదే సీన్ ని వాడుకుంటున్నారు. ఇక అందం, అభినయంతో అప్పట్లో కుర్రకారును ఆకట్టుకున్న కీర్తి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ముఖ్యంగా నాగార్జునతో రావోయి చందమామ సినిమాలో, మహేష్ బాబుకి అక్కగా అర్జున్ సినిమాలో నటించారు. టాలీవుడ్ లో అవకాశాలు అంతగా రాకపోవడంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. అక్కడ ఈమె నటించిన సినిమాలు అంతగా సక్సెస్ కాలేదు. టాలీవుడ్ కి చెందిన అక్కినేని హీరో సుమంత్ ను ప్రేమ వివాహం చేసుకుంది కీర్తి రెడ్డి.  అయితే వీరి దాంపత్య జీవితం మాత్రం  ఎక్కువ కాలం నిలవలేదు.పెళ్లి చేసుకున్న సంవత్సరానికే సుమంత్ తో విడిపోయింది. ఇక  ఆ తర్వాత కీర్తి సినిమాలకు దూరమైంది. పెళ్లి తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు పెద్దగా రాకపోవడంతో పూర్తిగా నటనకు గుడ్ బై చెప్పేసింది.  

Also Read :  ‘వినరో భాగ్యము విష్ణు కథ’ టైలర్ రిలీజ్ చేసిన సాయి ధరమ్ తేజ్

toliprema movie heroine

toliprema movie heroine

 

ఇక ఆ తరువాత ఓ ఎన్నారైని  రెండో పెళ్లి చేసుకున్న కీర్తి ప్రస్తుతం భర్తతో కలిసి అమెరికాలో స్థిరపడింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం హౌజ్ వైఫ్ గా లైఫ్ లీడ్ చేస్తున్న కీర్తి ఇటీవల ఇండియాలో జరిగిన బంధువుల ఫంక్షన్ లో మెరిసింది. ఇక ఈ వేడుకలో సమంత స్నేహితురాలు, ఫిట్ నెస్ ట్రైనర్ శిల్పారెడ్డి తో కలిసి దిగిన ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.  కీర్తి రెడ్డి లేటెస్ట్ ఫోటో బయటకు రావడంతో.. ఇప్పటికీ కీర్తి అలాగే ఉందని పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలకు తల్లి అయిన కీర్తి అందం మాత్రం ఏమాత్రం తరగలేదు అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు తొలిప్రేమ సినిమాలో ఈమెను చూసిన అభిమానులు మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తే బాగుండు అని కోరుకుంటున్నారు. 

Advertisement

Advertisement

Also Read :   Waltair Veerayya : “వాల్తేరు వీరయ్య” ఓటిటి రిలీజ్ డేట్ పిక్స్..స్ట్రీమింగ్ ఎందులో అంటే !