తెలుగు రాష్ట్రాల్లో నేడు పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరశాఖ వెల్లడించింది.
Advertisement
సికింద్రాబాద్ క్లబ్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పూర్తిగా దగ్ధం అయినట్టు సమాచారం. 10 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పెస్తున్నారు. జూబ్లీ బస్టాండ్ దగ్గరగా ఉండటంతో వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు.
ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్ కొట్టుమిట్టాడుతోంది.. పాక్ దేశీయ వాణిజ్యం క్షీణించింది. ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు దొరక్కపోవడంతో ఖాజానా ఖాళీ అయినట్టు తెలుస్తోంది. దాంతో కొత్త జాతీయ భద్రతా పాలసీని పాకిస్థాన్ తీసుకువచ్చింది.
రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. కరోనా పరిస్థితులపై కేబినెట్ చర్చించనుంది.
తెలంగాణలో మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్లో ఉన్నట్లు సమాచారం.
Advertisement
కరోనా ఉదృతి నేపథ్యంలో తెలంగాణ సర్కార్ విద్యాసంస్థలకు ఈనెల 30 వరకు సెలవు ప్రకటించింది.
భారత్లో కొత్తగా 2,71,202 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 314 మంది కరోనా తో మరణించారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 1,38,331 మంది కోలుకున్నారు.
జమ్మూకాశ్మీర్ లో ఆరుగురు లష్కరే తోయిబా తో అనుబంధం ఉన్న ఉగ్రవాద అనుచరులను ఆర్మీ అరెస్ట్ చేసింది. వాళ్ళ నుండి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మేఘన అనే 18 ఏళ్ల యువతి న్యూజిలాండ్ లో ఎంపిగా ఎన్నికయ్యారు. మేఘన తండ్రి 2001 లో న్యూజిల్యాండ్ లో స్థిరపడ్డాడు.
కృష్ణా ఉభయగోదావరి జిల్లాల్లో జోరుగా కోళ్ల పందాలు జరుగుతున్నాయి. పోలీసులు హెచ్చరిస్తున్నా పందెం రాయుళ్లు లెక్కచేయడం లేదు.