Home » Today top 10 : నేటి ముఖ్యమైన వార్తలు ఇవే…!

Today top 10 : నేటి ముఖ్యమైన వార్తలు ఇవే…!

by AJAY
Ad

 

corona omricon

corona omricon

భారత్‌లో కొత్తగా 2,64,202 కరోనా కేసులు నమోదయ్యాయి. 315 మరణాలు నమోదయ్యాయి. ఇక ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టివ్‌ కేసులు 12,72,073 ఉన్నాయి.

Advertisement

ప్రకాశం జిల్లా కారంచేడులో నందమూరి బాలయ్య సందడి చేశారు. తన సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి ఇంట్లో భోగి సంబరాల్లో బాలయ్య పాల్గొన్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి, వెంకటేశ్వరరావు దంపతులతో కలిసి బాలయ్య సందడి చేశారు.

24 గంటల్లో ఏపీలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమ, కోస్తాంధ్రలో భారీ వర్షాలు, తెలంగాణలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

INDIA CORONA UPDATE

సంగారెడ్డి లో కరోనా కలకలం రేపింది. కంది ఐఐటిలో 112 మంది విద్యార్థుల‌కు క‌రోనా పాజిటివ్‌ వచ్చింది. క‌రోనా బారిన ప‌డిన విద్యార్థుల‌కు ఐసోలేష‌న్‌లో చికిత్స‌ అందిస్తున్నారు.

Advertisement

 

భారత్ లో డెల్టా మహమ్మారి వల్ల 2.40 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది.

 

సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలో కోడి పందాల జోరు కనిపిస్తోంది. ఏకంగా లైవ్ లో కోడి పందాలు చూస్తూ బెట్టింగ్లు వేసేలా కేటుగాళ్లు ఓ వెబ్ సైట్ ని రూపొందించారు.

 

వరంగల్ ను ఐటీ హబ్ గా మార్చేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. తాజాగా వరంగల్ లో తమ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్టు ఐటీ సంస్థ మైండ్ ట్రీ వెల్లడించింది.

 

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. గణతంత్ర దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న తరుణంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ భద్రతను ఏర్పాటు చేసింది.

గ్రేట్ గ్రాండ్ మస్తి సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన అర్చనా గౌతమ్ కు ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది.

 

 

తెలంగాణలో చైనా మాంజా పై నిషేధం విధించారు. ఈ మాంజా వల్ల పక్షులకు వాహనదారులకు ప్రమాదం ఉన్న నేపథ్యంలో నిషేదం విధించారు.

Visitors Are Also Reading