Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా లాభాలుంటాయి.

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా లాభాలుంటాయి.

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 26.09.2022: మేషం

సంతృప్తిక‌రంగా ఉంటుంది. కొన్ని ముఖ్య‌మైన ప‌నులు వేగంగా పూర్తి అవుతాయి. వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాల్లో ఆర్థికంగా క‌లిసి వ‌స్తుంది. వాహ‌న సౌఖ్యం ఉంది. బంధు, మిత్రుల వ‌ల్ల లాభ‌ప‌డుతారు. ఇప్పుడు మంచి ప‌నులు త‌ల‌ప‌డితే స‌త్ఫ‌లితాలు ఇస్తాయి. ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

Today rashi phalau in telugu: వృషభం 

ఆర్థిక లాభానికి అవ‌కాశం ఉంది. కొన్ని బాకీలు వ‌సూలు అవుతాయి. ఇబ్బందుల్లో ఉన్న బంధువుల‌ను ఆదుకుంటారు. ఇంటా బ‌య‌టా ప‌ని ఒత్తిడి ఎక్కువ‌గా ఉంటుంది. ఉద్యోగ‌ప‌రంగా శుభ‌యోగం ఉంది. వ్యాపారంలో లాభాలు గ‌డిస్తారు. స‌మాజంలో గుర్తింపు ల‌భిస్తుంది. ముఖ్యమైన ప‌నులు పూర్తి చేయ‌గ‌లుగుతారు.

Today rashi phalau in telugu: మిథునం

జీవితానికి సంబంధించి మంచి నిర్ణ‌యాలు తీసుకోండి. ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌లో ఉద్యోగం ల‌భిస్తుంది. మ‌ధ్య మ‌ధ్య ఏదో ఒక అనారోగ్యం చికాకు పెడుతుంటుంది. ఉద్యోగంలో అద‌న‌పు బాధ్య‌త‌లు మీద ప‌డుతాయి. అదృష్ట‌యోగం ప‌ట్ట‌బోతుంది. అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టు డ‌బ్బు చేతికి అందుతుంది. త‌ల‌పెట్టిన ప‌నులు పూర్తి అవుతాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

ఉద్యోగంలో మార్పున‌కు అవ‌కాశం ఉంది. వృత్తి, వ్యాపారాల‌లో శ్ర‌ద్ద పెంచాలి. ఆదాయం నిల‌క‌డ‌గా ఉంటుంది. ఖ‌ర్చులు అదుపు చేసుకోవాలి. మీ ద్వారా కొంద‌రికి ప్ర‌యోజ‌నం చేకూరుతుంది.

Today rashi phalau in telugu : సింహం

ఉద్యోగంలో మంచి ఫ‌లితాలు సాదిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త నిర్ణ‌యాలు తీసుకుంటారు. ఇంటా, బ‌య‌టా ఒత్తిడి ఉన్నా ప‌ట్టుద‌ల‌గా ప‌నులు పూర్తి చేస్తారు. పెళ్లికి సంబంధించి శుభ‌వార్త వింటారు. ముఖ్యమైన నిర్ణ‌యాల్లో కుటుంబ స‌భ్యుల స‌ల‌హాలు తీసుకోండి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ఉద్యోగ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం. బంధు మిత్రుల నుంచి స‌హాయ‌, స‌హ‌కారాలు అందుతాయి. ప్ర‌యాణ లాభం ఉంది. రాద‌నుకున్న డ‌బ్బు కొద్ది ప్ర‌య‌త్నంతో చేతికి అందుతుంది. నిరుద్యోగులు శుభ‌వార్త వింటారు.

Today rashi phalau in telugu : తుల

అనుకున్న ప‌నులు శ్ర‌మ మీద పూర్తి అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు గ‌డించే అవ‌కాశ‌ముంది. ఉద్యోగంలో గౌర‌వ మ‌ర్యాద‌లు పెరుగుతాయి. అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా డ‌బ్బు చేతికి అందుతుంది. కుటుంబ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఉద్యోగంలో అధికార యోగానికి అవ‌కాశ‌ముంది. అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తారు. ఆర్థికంగా లాభ‌దాయ‌కంగా ఉంది. ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. సంతాన‌ప‌రంగా శుభ‌వార్త వింటారు. అనుకున్న ప‌నులు నెర‌వేరుతాయి. పెళ్లి ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. ఆక‌స్మికంగా ప్ర‌యాణాలు ఉంటాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఉద్యోగంలో స‌హోద్యోగుల స‌హ‌కారంతో ల‌క్ష్యాలు పూర్తి చేస్తారు. ఆదాయం నిల‌క‌డ‌గా ఉంటుంది. కానీ ఖ‌ర్చులు పెరుగుతాయి. వాద‌న‌ల‌కు దూరంగా ఉండండి. మ‌ధ్య మ‌ధ్య చికాకులు, అనారోగ్యాలు త‌ప్ప‌క‌పోవ‌చ్చు. కొంత‌వ‌ర‌కు శ్ర‌మ మీద ప‌నులు పూర్తి అవుతాయి. ప్ర‌యాణాలు ప‌ర‌వాలేదు. మీకు విశ్రాంతి అవ‌స‌రం.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా మెరుగుద‌ల క‌నిపిస్తోంది. ఉద్యోగంలో శ్రద్ధ పెంచాల్సిన అవ‌స‌రం ఉంది. ఇంటి స‌మ‌స్య ఒక‌టి అనుకోకుండా ప‌రిష్కార‌మ‌వుతుంది. సొంత నిర్ణ‌యాలు మంచి ఫ‌లితాల‌ను ఇస్తాయి. ఆదాయం నిల‌క‌డ‌గా ఉంటుంది.

Today rashi phalau in telugu : కుంభం

నిరుద్యోగుల‌కు మంచి సంస్థ‌లో ఉద్యోగం ల‌భించే అవ‌కాశ‌ముంది. వృత్తి, వ్యాపారాల్లో శుభ ఫ‌లితాలు ఉంటాయి. ఖ‌ర్చులు పెరుగుతాయి. కుటుంబం ద్వారా ల‌బ్ది పొందుతారు.

Today rashi phalau in telugu :  మీనం

ఆర్థిక ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంటుంది. ఉద్యోగంలో శ్ర‌మ పెరుగుతుంది. ఓర్ప‌తో వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. స‌హ‌చ‌రులు ఇబ్బందులు పెట్టే ప్ర‌య‌త్నం చేస్తారు. సొంత నిర్ణ‌యాలు మంచి ఫ‌లితాల‌ను ఇస్తాయి.

 

Visitors Are Also Reading