Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త వ‌హించాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త వ‌హించాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 21.09.2022: మేషం

మ‌ధ్య‌మ ఫ‌లితాలు ఉన్నాయి. శ్ర‌మ‌తో కూడిన ఫ‌లితాలు ఉన్నాయి. గ‌తంలో నిర్ల‌క్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బంది పెడుతాయి. కొన్ని ప‌రిస్థితులు మిమ్మ‌ల్ని నిరుత్సాహ‌ప‌రుస్తాయి. గోసేవ చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాలు పొందుతారు.

Today rashi phalau in telugu: వృషభం 

సొంతింటి వ్య‌వ‌హారాల్లో ముంద‌డుగు ప‌డుతుంది. బంధు,మిత్రుల‌ను క‌లుస్తారు. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఒక వార్త ఆనందాన్నిఇస్తుంది.

Today rashi phalau in telugu: మిథునం

అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డం చాలా అవ‌స‌రం. కొన్ని సంఘ‌ట‌న‌లు మీ ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతాయి. కీల‌క వ్య‌వ‌హారాల్లో ముంద‌డుగు ప‌డుతుంది. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

సంతోష‌క‌ర‌మైన వార్త వింటారు. ఆత్మీయుల ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయి. ధ‌న‌లాభం సూచితం. వివాదాల్లో త‌లదూర్చ‌కండి.

Today rashi phalau in telugu : సింహం

మీ ప్ర‌తిభ‌కు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అపోహ‌ల‌తో కాలాన్ని వృథా చేయ‌కండి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ఓ శుభ‌వార్త మీ మ‌నోధైర్యాన్ని పెంచుతుంది. స్వ‌స్థాన ప్రాప్తి సూచ‌న‌లున్నాయి. స్థిర నిర్ణ‌యాల‌తో చేసే ప‌నులు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : తుల

మీ మీ రంగాల్లో ప‌రిస్థితులు క్ర‌మ‌క్ర‌మంగా మీకు అనుకూలంగా ఏర్ప‌డుతాయి. ఏ ప‌ని త‌ల‌పెట్టినా ఇట్టే పూర్తి చేస్తారు. సంక‌ల్పం సిద్ధిస్తుంది. మిత్ర బ‌లం పెరుగుతుంది. కుటుంబ స‌భ్యుల‌కు మేలైన కాలం.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఉన్న‌త‌మైన ఆలోచ‌న విధానంతో అనుకున్న‌ది సాధిస్తారు. ఆధ్మాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

కీల‌క వ్య‌వ‌హారాల్లో ఆచితూచి అడుగేయాలి. ఒత్తిడి పెర‌గ‌కుండా ముందు జాగ్ర‌త్త‌తో వ్య‌వ‌హ‌రించాలి. బంధు, మిత్రుల వ‌ల్ల మేలు జ‌రుగుతుంది. అన‌వ‌స‌ర ఖ‌ర్చుల‌కు అడ్డుక‌ట్ట వేయాలి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

చేప‌ట్టినా ప‌నుల్లో చిన్న‌పాటి స‌మ‌స్య‌లు ఎదురైనా పూర్తి చేయ‌గ‌లుగుతారు. మీ మ‌నోధైర్యం మిమ్మ‌ల్ని గెలిపిస్తుంది. కొన్ని వ్య‌వ‌హారాల్లో బుద్ధి చంచ‌ల‌త్వంతో వ్య‌వ‌హ‌రిస్తారు.

Today rashi phalau in telugu : కుంభం

మీ మీ రంగాల్లో శుభ ఫ‌లితాలు ఉంటాయి. మ‌నఃసౌఖ్యం ఉంటుంది. బంధు, మిత్రుల‌తో క‌లిసి ఆనందంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu :  మీనం

స్థిర‌మైన బుద్ధితో వ్య‌వ‌హ‌రిస్తే ఉద్యోగంలో ఉన్న‌త స్థితి ఏర్ప‌డుతుంది. వ్యాపారంలో అనుభ‌వ‌జ్ఞుల స‌ల‌హాలు అవ‌స‌ర‌మ‌వుతాయి. స‌కాలంలో ఆదుకునేవారు ఉన్నారు.

Also Read :  Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు అనుకున్న ల‌క్ష్యాల‌ను సాధిస్తారు

Visitors Are Also Reading