Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి బంధువుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి బంధువుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి

by Anji
Published: Last Updated on
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 07.09.2022: మేషం

చక్క‌ని ఆలోచ‌న విధానంతో అనుకున్న‌ది సాధిస్తారు. నూత‌న కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతారు. మీ కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి.

Today rashi phalau in telugu: వృషభం 

త‌ల‌పెట్టిన కార్యాలు ఆటంకాలు ఎదురైనా అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. కొంద‌రి ప్ర‌వ‌ర్త‌న కాస్త బాధ క‌లిగిస్తుంది. కోపాన్ని త‌గ్గించుకుంటే మంచిది. కుటుంబంలో కొద్దిపాటి స‌మ‌స్య‌లు రావ‌చ్చు.

Today rashi phalau in telugu: మిథునం

కీల‌క వ్య‌వ‌హారాల్లో పెద్ద‌ల‌ను క‌లుస్తారు. నిర్ణ‌యం మీకు అనుకూలంగా వ‌స్తుంది. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అన‌వ‌స‌ర ధ‌న‌వ్య‌య సూచితం. బంధువుల‌తో వాద‌న‌ల‌కు దిగ‌డం వ‌ల్ల విబేదాలు వ‌చ్చే సూచ‌న‌లున్నాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

బంధువుల స‌హ‌కారం అందుతుంది. ఓ శుభ‌వార్త మీ మ‌నో ధైర్యాన్ని పెంచుతుంది. స‌మాజంలో పేరు ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : సింహం

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫ‌లితాలున్నాయి. తెలివితేట‌ల‌తో ఆలోచించి కొన్ని కీల‌క‌మైన పనుల‌ను పూర్తి చేయ‌గ‌లుగుతారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మీ మీ రంగాల్లో ఆశించిన ఫ‌లితాలు ఉంటాయి. స‌న్నిహితుల వ‌ల్ల మేలు జ‌రుగుతుంది. ముఖ్య విష‌యాల్లో మీ మ‌న‌స్సు చెప్పిన‌విధంగా న‌డుచుకోండి స‌త్ఫ‌లితాలు సాధిస్తారు. ఇంత‌కాలం ప‌డిన శ్ర‌మ కొలిక్కి వ‌స్తుంది.

Today rashi phalau in telugu : తుల

చేప‌ట్టే ప‌నుల్లో శ్ర‌మ పెరుగుతుంది. బంధువుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. ఆర్థిక విష‌యాల్లో ఖ‌ర్చులు పెర‌గ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌ల‌ను అమ‌లు చేస్తారు. ఇష్ట‌మైన వారితో కాలాన్ని గ‌డుపుతారు. మ‌నోధైర్యంతో చేసే ప‌నులు క‌లిసి వ‌స్తాయి. ఓర్పు త‌గ్గ‌కుండా చూసుకోవాలి. కుటుంబ స‌భ్యుల స‌హ‌కారం ఉంటుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

ప‌నుల్లో ఆల‌స్యం జ‌రుగ‌కుండా చూసుకోవాలి. కుటుంబ బాధ్య‌త‌లు అధికం అవుతాయి. ఓ ప‌రీక్ష లాగా వాటిని ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. మీ అంచ‌నాలు త‌ప్పుతాయి. విలువైన వ‌స్తువుల విష‌యాల్లో అజాగ్ర‌త్త ప‌నికి రాదు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

అదృష్ట ఫ‌లాలు అందుతాయి. అధికారాలు మీకు అనుకూల‌మైన నిర్ణ‌యాన్ని తీసుకుంటారు. కీల‌క వ్య‌వ‌హారాలు క‌లిసి వ‌స్తాయి. శ్ర‌మ పెర‌గ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : కుంభం

చేప‌ట్టే ప‌నుల్లో అల‌స‌ట పెర‌గ‌కుండా చూసుకోవాలి. అస్థిర బుద్ధి వ‌ల్ల ఇబ్బందుల‌కు గుర‌వుతారు. కీల‌క సంద‌ర్భాల్లో పెద్ద‌లు చెప్పే అనుభ‌వ సూత్రాలు అమృత గుళిక‌ల్లా ప‌ని చేస్తాయి. మ‌నో విచారం క‌లిగించే ఘ‌ట‌న‌ల‌కు దూరంగా ఉండాలి.

Today rashi phalau in telugu :  మీనం

అనుకున్న ప‌నులు నెర‌వేరుతాయి. మనఃసౌఖ్యం ఉంటుంది. మీ పై అధికారుల స‌హ‌కారం ఉంటుంది. ధ‌ర్మ‌సిద్ధి క‌ల‌దు. శ‌త్రువుల‌పై విజ‌యం సాధిస్తారు.

 

Visitors Are Also Reading