Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 11.10.2022: మేషం

చేప‌ట్టిన ప‌నుల్లో ప్ర‌తికూల ప‌రిస్థితులు ఏర్ప‌డినా ప‌ట్టుద‌ల‌తో వాటిని అధిగ‌మిస్తారు. కుటుంబ స‌భ్యుల మాట‌కు విలువ ఇవ్వ‌డం వ‌ల్ల ఇంట గెలుస్తారు.

Today rashi phalau in telugu: వృషభం 

మ‌నోధైర్యం మిమ్మ‌ల్ని గెలిపిస్తుంది. అల‌స‌ట పెరుగుతుంది. కొన్ని ప‌రిస్థితులు మిమ్మ‌ల్ని నిరుత్సాహ ప‌రుస్తాయి. కొన్ని వ్య‌వ‌హారాల్లో బుద్ధిచాంచ‌ల్యంతో వ్య‌వ‌హ‌రిస్తారు.

Today rashi phalau in telugu: మిథునం

ఆశించిన ఫ‌లితాలు సొంత‌మ‌వుతాయి. కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో స‌ఫ‌ల‌మ‌వుతారు. చేప‌ట్టిన ప‌నుల్లో విజ‌య‌దుందుభులు మోగిస్తారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

మీరు ఆశించిన ఫ‌లితాలు వ‌స్తాయి. బంధువుల‌తో ఆనందంగా గ‌డుపుతారు. మ‌నోబలం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్య‌మైన ప‌నుల్లో పురోగ‌తి ఉంటుంది.

Today rashi phalau in telugu : సింహం

అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగి మంచి ఫ‌లితాల‌ను అందుకుంటారు. చేప‌ట్టిన ప‌నుల‌ను చ‌క్క‌ని ప్ర‌ణాలిక‌ల‌తో పూర్తి చేయ‌గ‌లుగుతారు. విందు, వినోదాల‌తో కాలం గ‌డుస్తుంది.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది. చేయ‌ని పొర‌పాటుకు నింద ప‌డాల్సి వ‌స్తుంది. మ‌నోధైర్యాన్ని కోల్పోకండి. బంధువుల‌తో వాద‌న‌ల‌కు దిగ‌డం వ‌ల్ల విభేదాలు వ‌చ్చే సూచ‌న‌లున్నాయి.

Today rashi phalau in telugu : తుల

శ్ర‌మ పెర‌గ‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ప‌ట్టుద‌ల‌ను వ‌ద‌ల‌కండి. అస్థిర నిర్ణ‌యాల‌తో ఇబ్బందులు ప‌డ‌తారు. కుటుంబంలో చిన్న‌పాటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

బంగారు భ‌విష్య‌త్ కోసం వ్యూహ‌ర‌చ‌న చేస్తారు. శుభ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. శ‌త్రువుల‌పై విజయం సాధిస్తారు. ఒక సంఘ‌ట‌న సంతోషాన్ని క‌లిగిస్తుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

మీ మీ రంగాల్లో తోటివారిని క‌లుపుకొనిపోవాలి. మీ బుద్ధి బ‌లంతో కీల‌క స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార మార్గాల‌ను క‌నుగొంటారు. మాన‌సిక ప్ర‌శాంత‌త కోసం దైవ‌చింత‌న అవ‌స‌రం అవుతుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

చేప‌ట్టే ప‌నిలోశ్ర‌మ ఫ‌లిస్తుంది. ముఖ్య విష‌యాల్లో అవ‌గాహ‌న లోపం రాకుండా చూసుకోవాలి. చేప‌ట్టిన ప‌నుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగ‌మిస్తారు.

Today rashi phalau in telugu : కుంభం

ల‌క్ష్యాల‌ను చేరుకునే దిశ‌గా ఆలోచ‌న‌లు చేస్తారు. పెద్ద‌ల ప‌ట్ల గౌర‌వ మ‌ర్యాద‌లు కలిగి ఉంటారు. వ‌స్త్ర లాభం పొందుతారు.

Today rashi phalau in telugu :  మీనం

మంచి మ‌నస్సుతో ప‌నుల‌ను ప్రారంభిస్తారు. తోటివారితో క‌లిసి ఆనందంగా గ‌డుపుతారు. మిత్ర‌బ‌లం పెరుగుతుంది. ఆనందోత్స‌హాల‌తో కాలాన్ని గ‌డుపుతారు.

Visitors Are Also Reading