Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా లాభాలు ఉంటాయి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా లాభాలు ఉంటాయి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 10.10.2022: మేషం

మ‌ధ్య‌మ ఫ‌లితాలున్నాయి. ప‌క్క‌వారిని క‌లుపుకొని పోవ‌డం వ‌ల్ల ఇబ్బందులు త‌గ్గుతాయి. మ‌నోబ‌లం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్ర‌ద్ధ అవ‌స‌రం. దూర ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్తలు చాలా అవ‌స‌రం.

Today rashi phalau in telugu: వృషభం 

కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి చేసే ప‌నులు వెంట‌నే సిద్ధిస్తాయి. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌ ఉండాలి. ఓ శుభ‌వార్త వింటారు.

Today rashi phalau in telugu: మిథునం

చేప‌ట్టిన ప‌నుల‌ను ప్ర‌ణాళిక‌బ‌ద్ధంగా పూర్తి చేస్తారు. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు పెరుగుతాయి. అన‌వ‌స‌ర వ్య‌వ‌హారాల్లో త‌ల‌దూర్చ‌కుండా ఉండ‌డం మేలు.

Today rashi phalau in telugu : కర్కాటకం

అనుకూల ఫ‌లితాలు ఉన్నాయి. ఆస్తిని వృద్ధిచేసే ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. కుటుంబ సౌఖ్యం క‌ల‌దు. కీల‌క వ్య‌వ‌హారాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu : సింహం

చేప‌ట్టే ప‌నుల్లో ఆటంకాల‌ను తెలివిగా అధిగ‌మిస్తారు. భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు వేస్తారు. అధికారుల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. తోటివారితో అభిప్రాయ భేదాలు వ‌చ్చే సూచ‌న‌లున్నాయి. సూర్య ఆరాధ‌న శుభప్ర‌దం.

Today rashi phalau in telugu : కన్య

మ‌ధ్య‌మ ఫ‌లితాలు ఉంటాయి. మీమీ రంగాల్లో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. ఒత్తిడి పెర‌గ‌కుండా చూసుకోవాలి. ముఖ్య విష‌యాల్లో ముందుగానే స్పందించండి.

Advertisement

Today rashi phalau in telugu : తుల

మీ ఓర్పుకు ఇది ప‌రీక్షా కాలం. మీ మీ రంగాల్లో ఆచితూచి అడుగేయాలి. ఆలోచించి మాట్లాడాలి. లేకుంటే అప‌కీర్తిని మూట‌క‌ట్టుకుంటారు. ప్ర‌ణాళిక ద్వారా విజ‌యం సాధిస్తారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

మీ ధ‌ర్మం మిమ్మ‌ల్ని కాపాడుతుంది. ఉద్యోగంలో ఉన్న‌తిని సాధిస్తారు. తోటివారి స‌హ‌కారంతో స‌త్ఫ‌లితాల‌ను సాధిస్తారు. ఎట్టిప‌రిస్థితుల్లోనూ మొహ‌మాటంగా ద‌రిచేర‌నీయ‌కండి. ఖ‌ర్చులు పెర‌గ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : ధనుస్సు

శ్ర‌మ‌తో కూడిన ఫ‌లితాలు ఉంటాయి. నీర‌సించ‌కుండా ప‌ని చేస్తే గొప్ప ఫ‌లితాలు సాధిస్తారు. శ‌తృవులపై నైతిక విజ‌యం సాధిస్తారు. ముఖ్య విష‌యాల్లో అజాగ్ర‌త్త‌గా ఉంటే వివాదాలు చుట్టుముడుతాయి. చెడు స‌హ‌వాసం వ‌ల్ల మ‌నోవిచారం క‌లుగుతుంది. ఎవ్వ‌రినీ అతిగా న‌మ్మ‌కండి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

పెద్ద‌ల ఆశీర్వ‌చ‌న బ‌లంతో ఒక ప‌నిలో అనూహ్య ఫ‌లితాన్ని సాధిస్తారు. చిన్న చిన్న ఆటంకాల‌ను ప‌ట్టించుకోకుండా ముందుకు సాగితే అనుకున్న‌ది త్వ‌ర‌గా సాధిస్తారు. గౌర‌వం పెరుగుతుంది.

Today rashi phalau in telugu : కుంభం

విజ‌య అవ‌కాశాలు మెరుగ్గా ఉన్నాయి. బ‌ద్ధ‌కించ‌కుండా ప్ర‌య‌త్నించండి. అనుకూల ఫ‌లితాలు సొంత‌మ‌వుతాయి. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి కొన్ని మ‌ధుర క్ష‌ణాల‌ను గ‌డుపుతారు.

Today rashi phalau in telugu :  మీనం

బుద్ధిబ‌లంతో కొన్ని స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మిస్తారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ స‌భ్యుల‌తో ఆనందాన్ని పంచుకుంటారు. మిత్రుల వ‌ల్ల మేలు జ‌రుగుతుంది.

Visitors Are Also Reading