Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 27.11.2022: మేషం

దూరం ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయాల్సి వస్తుంది. ఆర్థికంగా నష్టాలు వస్తాయి.

Today rashi phalau in telugu: వృషభం 

దూర ప్రయాణాలు వాయిదా వేయడం బెటర్.  చేపట్టిన పనులు పూర్తి కావు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా చికాకు తెప్పిస్తుంది. ఆర్థిక వ్యహారాలు కాస్త పర్వాలేదనిస్తాయి.

Today rashi phalau in telugu: మిథునం

వ్యాపారస్తులకు అధికారులతో గొడవలు జరుగుతాయి. ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తుతాయి. ఆర్థికంగా నష్టాలు చేకూరే అవకాశముంది. శత్రువుల విషయంలో చాలా తెలివిగా బయటపడతారు. ఓ శుభవార్త వింటారు.

Today rashi phalau in telugu : సింహం

కీలకమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడుల విషయంలో పెద్దలు సలహాలు తీసుకొని ముందుకు సాగడం ఉత్తమం. చిన్ననాటి స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

వ్యాపార రంగంలో లాభాలు చేకూరుతాయి. దూరపు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం ఉత్తమం. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ధన వ్యవహారాల్లో ఇతరులకు మాట ఇవ్వకపోవడం ఉత్తమం.

Today rashi phalau in telugu : తుల

వ్యాపార వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు తలెత్తే అవకాశముంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండదు. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. జీవిత భాగస్వామితో మాటపట్టింపులుంటాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిధానంగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్య తలెత్తే అవకాశం ఉంది. గర్భిణీలు దూర ప్రయాణాలు చేయకపోవడం ఉత్తమం.

Today rashi phalau in telugu : ధనుస్సు

కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది. వ్యాపారాల్లో విశేషమైన లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో ఉన్నత అవకాశాలను పొందుతారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

దూర ప్రయాణాలు వాయిదా పడే అవకాశముంది.  నిరుద్యోగులు ఓ శుభవార్త వింటారు. వ్యాపారం కలిసొస్తుంది. మిత్రులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి.

Today rashi phalau in telugu : కుంభం

కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు తలెత్తుతాయి. అనారోగ్యంతో బాధపడుతుంటారు. ఆర్థికంగా నష్టాలు తలెత్తుతాయి. పలువురు ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

Today rashi phalau in telugu :  మీనం

వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. ఓ శుభవార్త వింటారు. కుటుంబ సభ్యుల మధ్య ఓ రాజీ కుదురుతుంది.

Visitors Are Also Reading