Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి

by Anji

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Today rashi phalau in telugu 23.11.2022: మేషం

అనుకున్న సమయంలో అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు కష్టపడాలి. భవిష్యత్ కి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

Today rashi phalau in telugu: వృషభం 

ప్రారంభించిన పనిని పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్ ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. మొహమాటాలతో ఖర్చులు పెరుగుతాయి.

Today rashi phalau in telugu: మిథునం

మనోధైర్యంతో ముందుకు సాగి సంతృప్తికరమైన ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. ఇష్టమైన వారితో కాసేపు కాలక్షేపంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి.

Today rashi phalau in telugu : కర్కాటకం

పనులకు ఆటంకం కలుగకుండా జాగ్రత్త పడాలి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. కోపం రాకుండా జాగ్రత్త పడాలి. ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దాన, ధర్మాలు చేయడం ద్వారా మంచి జరుగుతుంది.

Today rashi phalau in telugu : సింహం

ఆరంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎలాంటి పరిస్థితిలోనూ అజాగ్రత్తగా ఉండకూడదు.

Today rashi phalau in telugu : కన్య

సమయానికి పనులను పూర్తి చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆశీస్సులు ఉంటాయి. కలహాలకు దూరంగా ఉండాలి. అలసట చెందకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : తుల

అనుకున్న పనులు నెరవేరుతాయి. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ధన, వస్త్ర లాభాలు కలవు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఆయా రంగాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి.  మీ చుట్టూ గిట్టని వాళ్లూ చేరి మిమ్మల్నీ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

మీ వినయవిధేయతలు మిమ్మల్ని రక్షిస్తాయి. ఇన్నాళ్లుగా మీకు అనుకూలంగా ఉన్నవాళ్లు వ్యతిరేకంగా మారే అవకాశముంది. సంబంధ, బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం ఉత్తమం. తోటి వ్యక్తులతో ఆచితూచి వ్యవహరించాలి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

మంచి పనులను ప్రారంభిస్తారు. కొన్ని సంఘటనల ద్వారా మానసిక ఆనందాన్ని పొందుతారు. లక్ష్య సాధనలో ఆత్మీయుల సహకారముంటుంది.

Today rashi phalau in telugu : కుంభం

నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. బుద్ధిబలంతో కీలక వ్యవహారాల్లో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు.

Today rashi phalau in telugu :  మీనం

కొందరి వల్ల ఆటంకాలు ఎదురవుతాయి.  కీలకమైన విషయాల్లో నిపుణులను సంప్రదించడం ఉత్తమం. అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి గొడవలు జరుగకుండా అప్రమత్తంగా ఉండడం బెటర్.

Visitors Are Also Reading