Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 08.11.2022: మేషం

అంత అనుకూలమైన కాలం కాదు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లకపోతే పనులను పూర్తి చేయలేరు. ఇవాళ పడబోతున్న చంద్రగ్రహణం అథమ ఫలాన్ని అందిస్తోంది.

Today rashi phalau in telugu: వృషభం 

మనోబలంతో చేసే పనులు అనుకూలిస్తాయి. దైవారాధన వల్ల ఆత్మశక్తి పెరుగుతుంది. ముఖ్యవ్యవహారంలో ముందు జాగ్రత్త చాలా అవసరం. తోటివారిని కలుపుకొని పోవడం వల్ల మంచి జరుగుతుంది.

Today rashi phalau in telugu: మిథునం

ఊహించిన దాని కంటే గొప్ప ఫలితాలను అందుకుంటారు. సమయం చాలా విలువైనదిగా భావిస్తారు. రక్త సంబంధీకులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఒక వార్త శక్తిని ఇస్తుంది. లాభ స్థానంలో పడుతున్న చంద్రగ్రహణం శుభఫలితాన్ని ఇస్తుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

ముఖ్యమైన పనులను ప్రారంభిస్తారు. చేపట్టిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. దశమ స్థానంలో నేడు పడుతున్న చంద్రగ్రహణం శుభ ఫలితాన్ని ఇస్తుంది.

Today rashi phalau in telugu : సింహం

ప్రారంభించిన కార్యక్రమాల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. పెద్దల ఆశీర్వచనంతో చేసే పనులు ఫలిస్తాయి. అనవసర విషయాల్లో తలదూర్చకండి. నవమ స్థానంలో నేడు పడుతున్న చంద్రగ్రహణం మధ్యమ ఫలితాన్ని ఇస్తుంది.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మిశ్రమ పలితాలు శ్రమతో కూడిన ఫలితాలను అందుకుంటారు. కీలక విషయాల్లో బద్ధకించకూడదు. కొందరి ప్రవర్తన మీకు కాస్త మనస్థాపాన్ని కలిగిస్తుంది. కొందరూ మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు. కీలక సమయాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది.

Today rashi phalau in telugu : తుల

మధ్యమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధు, మిత్రుల సహకారముంటుంది. మనోధైర్యంతో విజయాలను సాధిస్తారు. అనవసరమైన ఆందోళన తగ్గించుకుంటే చాలా మంచిది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

కీలక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒక వ్యవహారంలో మీ ఆలోచనలు అందరి ప్రశంసలను అందుకుంటాయి. అవసరానికి తగిన సాయం అందుతుంది. అభిప్రాయబేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. పంచమ స్థానంలో నేడుపడుతున్న చంద్ర గ్రహణం మధ్యమ ఫలితాన్ని ఇస్తుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఆశించిన ఫలితాలను రాబట్టడంలో పర్వాలేదనిపిస్తుంది. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు రాకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : కుంభం

చక్కని ప్రణాళికతో అనుకున్నది సాధిస్తారు. సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగితే అనుకూలత లభిస్తుంది. కీలక పనులను ఇవాళ ప్రారంభిస్తారు. ఇవాళ పడుతున్న చంద్ర గ్రహణం శుభ ఫలితాన్ని ఇస్తుంది.

Today rashi phalau in telugu :  మీనం

శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు చేేసే ముందు పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగితే అనుకూల ఫలితాలు అందుకుంటారు. శత్రువుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.

Visitors Are Also Reading