Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆచితూచి అడుగేయాలి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆచితూచి అడుగేయాలి

by Anji
Ad

ప్రతిరోజు ఉదయం వేళ‌లో రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవ‌చ్చు.  ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

Today rashi phalau in telugu 30.05.2022: మేషం

 

స‌మ‌యానుకూలంగా ముందుకు సాగండి. ప‌నుల‌కు ఆటంకం క‌ల‌గకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ధ‌నలాభం సూచితం. మాన‌సిక ప్ర‌శాంత‌త కోసం దైవ సంద‌ర్శ‌న చేయ‌డం ఉత్త‌మం.

Today rashi phalau in telugu: వృషభం 

త‌ల‌పెట్టిన ప‌నుల్లో శీఘ్ర విజ‌యాన్ని సాధిస్తారు. బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌ర్తిస్తారు. అర్థ‌లాభం ఉంది. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు.

Today rashi phalau in telugu: మిథునం

కీల‌క వ్య‌వ‌హారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. అధికారులు మీ ప‌ని తీరుతో సంతృప్తి చెంద‌క‌పోవ‌చ్చు. అస్థిర నిర్ణ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. క‌ల‌హాల‌కు దూరంగా ఉండాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం

కర్కాటక రాశి స్వభావం కర్కాటక రాశి

ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. సొంతింటి వ్య‌వ‌హారంలో ముంద‌డుగు ప‌డుతుంది. బంధు మిత్రుల‌ను క‌లుస్తారు. ఓ వార్త ఆనందాన్నిస్తుంది.

Today rashi phalau in telugu : సింహం

మీ పని తీరుకు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. అల‌స‌ట పెరుగుతుంది. ముఖ్య‌మైన విష‌యాల‌కు సంబంధించి పెద్ద‌ల స‌ల‌హాలు మేలు చేస్తాయి. మీరు ఎప్ప‌టి నుండో చేయాల‌నుకుంటున్న ఓ ముఖ్య‌మైన ప‌నిని విజ‌య‌వంతంగా పూర్తి చేస్తారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

చేప‌ట్టిన ప‌నులు విజ‌య‌వంతంగా పూర్తి అవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విష‌యాలు లాభిస్తాయి. మీ స్వ‌ధ‌ర్మం మిమ్మ‌ల‌ను కాపాడుతుంది.

Today rashi phalau in telugu : తుల

అధికారుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. కీల‌క‌మైన విష‌యాల్లో జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు పెరిగే అవ‌కాశాలున్నాయి. వైరాగ్యాన్ని ద‌రిచేయ‌నీయ‌వ‌ద్దు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

తోటివారి స‌హ‌కారంతో ప‌నులు పూర్త‌వుతాయి. అవ‌స‌రానికి త‌గిన సాయం అందుతుంది. అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. ప్రారంభించిన ప‌నుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు.

Today rashi phalau in telugu : ధనస్సు

మీ ప్ర‌తిభ‌కు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. మీకు శుభ‌కాలం కలిసి వ‌స్తుంది. కుటుంబ స‌భ్యుల‌తో ఓ శుభ‌వార్త‌ను పంచుకుంటారు. శుభ‌కార్యాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

చేప‌ట్టిన ప‌నుల్లో ఆటంకాలు ఎదురైన‌ప్ప‌టికి అధిగ‌మిస్తారు. ఓ వ్య‌వ‌హారంలో మీ చేతికి న‌గ‌దు అందుతుంది. ఓ శుభ‌వార్త మీ ఆత్మ‌విశ్వాన్ని పెంచుతుంది.

Today rashi phalau in telugu : కుంభం

 

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాల్లో సంద‌ర్భానుసారంగా ముందుకు సాగితే శుభ‌ఫ‌లితాలు పొందుతారు. మీ ప‌ట్టుద‌లే మిమ్మ‌ల్ని ముందుకు న‌డిపిస్తుంది. ఆర్థికంగా శుభ‌కాలం క‌లిసి వ‌స్తుంది.

Today rashi phalau in telugu :  మీనం

 

ఆశించిన ఫ‌లితాల‌ను పొందుతారు. అదృష్టం వ‌రిస్తుంది. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. కుటుంబ స‌భ్యుల‌తో ఆనందంగా గ‌డుపుతారు.

Visitors Are Also Reading