Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు శుభవార్తలు వింటారు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు శుభవార్తలు వింటారు

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 26.05.2023: మేషం

Advertisement

ఇవాళ చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది. పని ఒత్తిడి, టెన్షన్లు తగ్గుతాయి. ఆరోగ్యం కాస్త బాగానే ఉంటుంది. ఆర్థికంగా కొద్దిగా కలిసి వస్తుంది. ఎక్కువగా కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు.

Today rashi phalau in telugu :  వృషభం 

ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ ఖర్చులు తగ్గించుకోవడం చాలా మంచిది. ఎవ్వరూ అడిగితే వారికి ఆర్థిక సాయం చేయడం వల్ల కొద్దిగా నష్టపోయే అవకాశముంది. ఉద్యోగంలో ఆశించిన విధంగా స్థిరత్వం ఏర్పడుతుంది.

Today rashi phalau in telugu : మిథునం

వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంప్రదించి సాంప్రదాయ నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. అనవసర విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఆర్థిక ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల మార్పులు సంభవిస్తాయి. కుటుంబ పెద్దల నుంచి ఆశించిన సహాయ, సహకారాలు లభిస్తాయి. స్నేహితులు పక్కదోవ పట్టించే అవకాశముంది. ఆదాయం కాస్త నిలకడగా ఉంటుంది. 

Today rashi phalau in telugu :  సింహం

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆదాయపరంగా ఓ శుభవార్త వింటారు. మొండి బాకి ఒకటి వసూలు అవుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా మారుతుంది. చాలా కాలం నుంచి ఇబ్బంది పెడుతున్న సమస్య పరిష్కారమవుతుంది.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ఆర్థిక పరిస్థితి కాస్త ఒడిదుడుకులకు లోన్ అవుతుంది. డబ్బు ఇవ్వాల్సిన వాళ్లు ముఖం చాటేస్తారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది.

Today rashi phalau in telugu : తుల

కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో ఆశించిన దాని కంటే ఎక్కువగా అభివృద్ధి సాధిస్తారు. 

Today rashi phalau in telugu : వృశ్చికం

ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశముంది. బంధుమిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా, ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. కీలక నిర్ణయాలు కలిసి వస్తాయి. అన్ని విధాలుగా ఇది అనుకూల సమయం. నిరుద్యోగులు మంచి ఆఫర్లను అందుకుంటారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. కొద్దిగా పని భారం తప్పకపోవచ్చు. జీవిత భాగస్వామితో పారదర్శకంగా వ్యవహరించడం ఉత్తమం. బంధు మిత్రుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉండే సూచనలున్నాయి.

Today Horoscope in telugu : కుంభం

కొత్త ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆర్థిక వ్యవహాారాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఇతర లావాదేవీలకు ఇది అనుకూల సమయం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఈ రాశి వారికి ఇవాళ హ్యాపీగా గడిచిపోతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక సంబంధమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు : 

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. మే 21 నుంచి 27 వరకు ఆయా రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయంటే ?

Visitors Are Also Reading