Home » Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు జాగ్ర‌త్త‌గా ఉండండి

Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు జాగ్ర‌త్త‌గా ఉండండి

by Anji
Ad

ఉద‌యం నిద్ర లేవ‌గానే రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం ద్వారా ఏ రాశి వారి ఫ‌లితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

 

Today rashi phalau in telugu 10.05.2022: మేషం

మ‌నోధైర్యం మిమ్మ‌ల్ని గెలిపిస్తుంది. అల‌స‌ట పెరుగుతుంది. కొన్ని ప‌రిస్థితులు మిమ్మ‌ల్ని నిరుత్సాహ ప‌రుస్తాయి. కొన్ని వ్య‌వ‌హారాల్లో బుద్ధిచాంచ‌ల్యంతో వ్య‌వ‌హ‌రిస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

Today rashi phalau in telugu: వృషభం 

ఒక మంచి వార్త వింటారు. ప్రారంభించిన ప‌నుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. అన‌వ‌స‌ర వివాదాల్లో చిక్కుకునే అవ‌కాశ‌ముంది.

Today rashi phalau in telugu: మిథునం

మిత్రుల వల్ల మేలు జ‌రుగుతుంది. ఖ‌ర్చులు పెరుగుతాయి. ద‌గ్గ‌రి వారితో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. శ్ర‌మ అధికం అవుతుంది. ప్ర‌యాణాల్లో అజాగ్ర‌త్త వ‌ద్దు.

Today rashi phalau in telugu : కర్కాటకం

కర్కాటక రాశి స్వభావం కర్కాటక రాశి

ఆశించిన ఫ‌లితాలు సొంత‌మ‌వుతాయి. కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో స‌ఫ‌ల‌మ‌వుతారు. ప్రారంభించిన ప‌నుల్లో విజ‌య దుందుబులు మోగిస్తారు.

Today rashi phalau in telugu : సింహం

అనుకున్న ప‌నుల‌ను అనుకున్న‌ట్టు చేయ‌గ‌లుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వ్య‌వ‌హారం ల‌భించినా.. జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. కొన్ని వ్య‌వ‌హారాల్లో ధైర్యంగా వ్య‌వ‌హ‌రించి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

కృషి, ప‌ట్టుద‌ల‌తో అనుకున్న‌ది సాధిస్తారు. కొన్నాళ్లుగా ప‌రిష్కారం కానీ ఓ స‌మ‌స్య ఈ వారంలో ప‌రిష్కార‌మ‌వుతుంది. స‌మాజంలో కీర్తి పెరుగుతుంది.

Today rashi phalau in telugu : తుల

ప్రారంభించ‌బోయే ప‌నిలో దోషాలు పెరుగ‌కుండా చూసుకోవాలి. ఆచితూచి ఖ‌ర్చు చేయాలి. విచ‌క్ష‌ణ జ్ఞానంతో ముందుకు సాగితే స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. చ‌క్క‌టి ప్ర‌ణాళిక ద్వారా విజ‌యాల‌కు ద‌గ్గ‌ర‌వుతారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

అర్థలాభం క‌లుగుతుంది. ప‌నుల‌కు ఆటంకం క‌లుగ‌కుండా చూసుకోవాలి. మీ స్వ‌ధ‌ర్మం మిమ్మ‌ల్ని ర‌క్షిస్తుంది. బుద్ధిబ‌లం బాగుండ‌డం వ‌ల్ల కొన్ని కీల‌క వ్య‌వ‌హారాల నుంచి బ‌య‌ట‌ప‌డ‌గలుగుతారు. ఆరోగ్యంపై శ్ర‌ద్ధ అవ‌స‌రం.

Today rashi phalau in telugu : ధనస్సు

ప్రారంభించిన ప‌నుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగ‌మిస్తారు. ఓ వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు, మిత్రుల‌తో క‌లిసి శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఓ వార్త మిమ్మ‌ల్ని ఉత్సాహ‌ప‌రుస్తుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

శ్ర‌మ‌కు త‌గిన గుర్తింపు ల‌భిస్తుంది. తెలివితేట‌ల‌తో ఆలోచించి కొన్ని కీల‌క ప‌నుల‌ను పూర్తి చేయ‌గ‌లుగుతారు. కొన్ని చర్చ‌లు ల‌భిస్తాయి. ఉద్యోగంలో శుభ‌ఫ‌లితాలున్నాయి. అధికారుల స‌హ‌కార‌ముంది.

Today rashi phalau in telugu : కుంభం

అభివృద్ధికి సంబంధించిన ఓ శుభ‌వార్త వింటారు. ఒత్తిడి పెర‌గ‌కుండా చూసుకోవాలి. కుటుంబ స‌భ్యుల మాట వినండి మీకు మంచి జ‌రుగుతుంది.

Today rashi phalau in telugu :  మీనం

మిశ్ర‌మ ఫ‌లితాలుంటాయి. కుటుంబ స‌భ్యుల స‌హ‌కారంతో పూర్తి చేయ‌గ‌లుగుతారు. కుటుంబ వ్య‌వ‌హారాల్లో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. త‌ప్పుదారి ప‌ట్టించే వారున్నారు జాగ్ర‌త్త‌.

Visitors Are Also Reading