Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభ‌వార్త వింటారు

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభ‌వార్త వింటారు

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 26.06.2022: మేషం

 

మ‌నోబ‌లంతో చేసే ప‌నులు స‌ఫ‌ల‌మ‌వుతాయి. తోటివారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. అన‌వ‌స‌రంగా క‌ష్టాల‌ను తెచ్చుకుంటారు. కొన్ని ప‌రిస్థితులు మ‌న‌విచారాన్ని క‌లిగిస్తాయి.

Today rashi phalau in telugu: వృషభం 

 మానసికంగా దృఢంగా ఉండి, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది.

Today rashi phalau in telugu: మిథునం

 

చంచ‌ల స్వ‌భావాన్ని ద‌రిచేర‌నీయ‌కండి. క‌ష్టాలు పెర‌గ‌కుండా ముందు చూపుతో వ్య‌వ‌హ‌రించాలి. అనారోగ్య స‌మ‌స్య‌లు కాస్త ఇబ్బంది పెడ‌తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

ప‌నులు వేగ‌వంతంగా పూర్త‌వుతాయి. మ‌నోధైర్యంతో ముందుకు సాగుతారు. బంధువుల‌త క‌లిసి ఆనందంగా గ‌డుపుతారు. వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాల్లో అనుకూల‌మైన స‌మ‌యం. ఆర్థిక విష‌యాలు అనుకూలంగా ఉన్నాయి.

Today rashi phalau in telugu : సింహం

బుద్ధిబ‌లంతో ప‌ని చేసి అనుకున్న‌ది సాధిస్తారు. ఓ శుభ‌వార్త మీ మ‌నోధైర్యాన్ని పెంచుతుంది. మీ పేరు ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : కన్య

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాది రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. బుద్ధిబ‌లం బాగుంటుంది. ఆర్థికంగా శుభ‌ఫ‌లితాలున్నాయి. ఆరోగ్యం ప‌ర‌వాలేద‌నిపిస్తుంది. శ్ర‌మ వ‌ల్ల ఒత్తిడి పెరుగుతుంది.

Advertisement

Today rashi phalau in telugu : తుల

ప్రారంభించ‌బోయే ప‌నుల్లో ఆప‌ద‌లు పెర‌గ‌కుండా చూసుకోవాలి. ఉద్యోగంలో ఆత్మ‌స్థైర్యంతో ముందుకు సాగితే మేలైన ప‌లితాలు పొందుతారు. ఆర్థికంగా పుంజుకుంటారు. అయిన‌వారి వ‌ల్ల స‌మ‌స్య‌లు రాకుండాజాగ్ర‌త్త ప‌డాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ప్రారంభించిన కార్య‌క్ర‌మాల‌ను మ‌నోధైర్యంతో పూర్తి చేస్తారు. తోటివారితో ఆనందంగా గ‌డుపుతారు. బంధు, మిత్రుల‌తో స‌త్సంబంధాలు ఏర్ప‌డుతాయి. కీల‌క‌మైన చ‌ర్చ‌లు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : ధనస్సు

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాది రంగాల్లో మీకు అనుకూల‌మైన నిర్ణ‌యాలు వెలువ‌డుతాయి. మీ ప‌నితీరుకు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. కీల‌క‌మైన విష‌యాల‌కు సంబంధించి పెద్ద‌ల‌ను క‌లుస్తారు. గ‌తంలో ఆగిన ప‌నుల‌ను పునఃప్రారంభం చేస్తారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు దైవ‌బ‌లంతో పూర్తి చేస్తారు. భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు ర‌చించ‌డానికి ఇది స‌రైన స‌మ‌యం. నూత‌న వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు. అన‌వ‌స‌ర ఖ‌ర్చుల‌ను అదుపు చేయండి. మ‌న‌స్సు స్థిరంగా ఉంచుకోవాలి.

Today rashi phalau in telugu : కుంభం

ఉద్యోగంలో మంచి ఫ‌లితాలుంటాయి. స్వ‌స్థాన ప్రాప్తి ఉంది. శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. పెద్ద‌ల ఆశీర్వ‌చ‌నాలు మేలు చేస్తాయి. కొన్ని సంఘ‌ట‌న‌లు మిమ్మ‌ల్ని నిరుత్సాహ‌ప‌రుస్తాయి.

Today rashi phalau in telugu :  మీనం

ముఖ్య‌మైన వ్య‌వ‌హారాల్లో శోధ‌న చాలా అవ‌స‌రం. వ్యాపారంలో మీరు చేసే ఆలోచ‌న‌ల‌ను ఎదుటివారితో పంచుకోవ‌డం ద్వారా సాధ్యసాధ్యాల‌ను అంచ‌నా వేయ‌వ‌చ్చు. అధికారుల‌తో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించండి.

Visitors Are Also Reading